దుబాయ్‌లో బంగారు హయబుసా సంచలనం – రూ.1.67 కోట్ల గోల్డ్ బైక్‌పై ప్రపంచం ఫిదా

ప్రపంచవ్యాప్తంగా వేగం, స్టైల్, పవర్‌కు ప్రతీకగా నిలిచిన సుజుకి హయబుసా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బైక్‌ను కలగా భావించే వారు లక్షల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ బైక్ అభిమానులకు ఊహించని షాక్ ఎదురైంది. దుబాయ్‌లో జరిగిన ఓ ప్రఖ్యాత మోటార్ షోలో బంగారంతో తయారు చేసిన హయబుసా ప్రత్యక్షమై అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ బంగారు హయబుసా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణ హయబుసా ధరే ఇప్పటికే లక్షల్లో ఉంటుంది. అయితే ఈ బంగారు వెర్షన్ ధర విన్న వారందరూ షాక్‌కు గురవుతున్నారు. సమాచారం ప్రకారం, ఈ బైక్ ధర అక్షరాలా ₹1.67 కోట్లు.

దీనిలో ఎక్కువ భాగం గోల్డ్ బాడీవర్క్‌తో రూపొందించబడింది. పైగా వజ్రాలు కూడా అలంకారంగా అమర్చబడ్డాయి. అద్భుతమైన ఫినిష్ కోసం బోల్టులు కూడా బంగారంతోనే తయారు చేశారు. ప్రత్యేకంగా ఈ బైక్‌కు వేసిన గోల్డ్ లీఫ్ పెయింట్‌కే సుమారు ₹13.3 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ పెయింట్ వర్క్‌ను ప్రపంచ ప్రఖ్యాత ఆటోమోటివ్ ఆర్టిస్ట్ మిస్టర్ డానీ స్వయంగా పూర్తి చేశారు.

400 హార్స్‌పవర్ ఇంజిన్‌తో రూపొందిన ఈ బైక్, ఆటోమొబైల్ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరింత ఆశ్చర్యమేమిటంటే, దీని వెనుక టైరు పరిమాణం బుగట్టి కార్ టైరు కంటే పెద్దగా కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ బంగారు హయబుసా వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. “బంగారంతో హయబుసా చేస్తే ఇంత అద్భుతంగా ఉంటుందా!” అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు “దీన్ని చూసేందుకు కళ్లే సరిపోవట్లేదు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఆటోమొబైల్ ప్రపంచంలో ఈ బైక్ ఇప్పుడు లగ్జరీకి కొత్త నిర్వచనంగా మారింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి