ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. యశ్వంత్‌పూర్–కాచిగూడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు కొత్తగా హాల్ట్ మంజూరైంది. ఇకపై ఈ వందేభారత్ రైలు హిందూపురం రైల్వే స్టేషన్‌లో నిలిచేలా రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సౌకర్యం డిసెంబర్ 27 నుంచి అమల్లోకి రానుంది.
డిసెంబర్ 27 నుంచి హిందూపురంలో స్టాపింగ్
యశ్వంత్‌పూర్–కాచిగూడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20703 / 20704) రైలు హిందూపురంలో రెండు నిమిషాల పాటు హాల్ట్ అవుతుంది.
ఈ నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులను సౌత్ వెస్ట్రన్ రైల్వే డిప్యూటీ సీఎంఓ ఎన్. రాజ్‌కుమార్ విడుదల చేశారు.
డిసెంబర్ 27న కాచిగూడ నుంచి వచ్చే వందేభారత్ రైలును రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న హిందూపురం స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించనున్నారు.
వందేభారత్ టైమింగ్స్ ఇలా
కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్‌కు
- ఉదయం 5.45 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరుతుంది
- మధ్యాహ్నం 12.00 గంటలకు హిందూపురం చేరుకుంటుంది
- అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.00 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది
యశ్వంత్‌పూర్ నుంచి కాచిగూడకు
- మధ్యాహ్నం 2.45 గంటలకు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరుతుంది
- మధ్యాహ్నం 3.35 గంటలకు హిందూపురం చేరుకుంటుంది
- అనంతరం కాచిగూడకు ప్రయాణం కొనసాగుతుంది
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు భారీ లాభం
హిందూపురం స్టేషన్‌లో వందేభారత్ హాల్ట్ ఇవ్వడం వల్ల
- అనంతపురం
- శ్రీసత్యసాయి జిల్లాల
ప్రజలకు బెంగళూరు, హైదరాబాద్ ప్రయాణం మరింత సులభమవుతుంది. హిందూపురం నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బెంగళూరుకు వెళ్లే నేపథ్యంలో ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వారికి ఎంతో ఉపయుక్తంగా మారనుంది.
హిందూపురంలో స్టాప్ ఇవ్వాలని స్థానిక ఎంపీ బీకే పార్థసారథి రైల్వే మంత్రిని కోరగా.. వెంటనే గ్రీన్ సిగ్నల్ రావడం విశేషం.
ఏపీకి మరో కొత్త రైలు సేవ
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌కు మరో కొత్త రైలు సేవ త్వరలో ప్రారంభం కానుంది.
గుంతకల్లు–డోన్–మార్కాపురం రోడ్డు మధ్య కొత్త రైలు సేవను రైల్వే శాఖ ప్రకటించింది.
కొత్త రైలు టైమింగ్స్
- గుంతకల్లు నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి
- రాత్రి 11.30 గంటలకు మార్కాపురం రోడ్డు చేరుకుంటుంది
తిరుగు ప్రయాణంలో
- మార్కాపురం రోడ్డు నుంచి తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరి
- ఉదయం 10.30 గంటలకు గుంతకల్లు చేరుకుంటుంది
ఈ రైలు మద్దికెర, పెండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమిట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లి, జగ్గంబొట్ల, కృష్ణాపురం, కంబం, తర్లుపాడు వంటి స్టేషన్లలో ఆగుతుంది.
ఈ రైలు ప్రారంభ తేదీపై త్వరలో స్పష్టత రానుంది.



