ముక్కుతో బీరు తాగిన వ్యక్తి వీడియో వైరల్‌ – నెటిజన్లు షాక్‌!

సోషల్‌ మీడియాలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్నివి నవ్వులు పంచుతుంటే, మరికొన్నివి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా అలాంటి ఒక వీడియో నెటిజన్లను నోరెళ్లబెట్టేలా చేసింది. ఓ వ్యక్తి గ్లాసు నిండా ఉన్న బీరును నోటితో కాకుండా… ముక్కుతో తాగేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఆ వ్యక్తి చేతిలో పెద్ద గ్లాసులో బీరు పట్టుకుని కనిపిస్తాడు. మొదట కొన్ని క్షణాలు అటూ ఇటూ ఊగుతూ కనిపించిన అతడు, ఒక్కసారిగా గ్లాసును ముక్కు దగ్గరికి తీసుకెళ్లి, ఆ బీరు మొత్తాన్ని చుక్క కూడా వృథా కాకుండా ముక్కు ద్వారా తాగేశాడు. ఈ దృశ్యం చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో తలలు పట్టుకుంటున్నారు.

ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. “ఇలా ఎలా తాగగలిగాడు?” అని ఒకరు ప్రశ్నిస్తే, “ఇలాంటి విన్యాసాలు శరీరానికి ప్రమాదకరం” అని మరొకరు హెచ్చరించారు. “నిన్ను చూసాకే ‘టాలెంట్’ అంటే ఏమిటో అర్థమైంది గురూ!” అంటూ కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు “అతను ఇంకా బతికే ఉన్నాడా?” అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏదేమైనప్పటికీ, సోషల్‌ మీడియా ఫేమ్‌ కోసం, లైకుల కోసం కొందరు చేసే ఇలాంటి వింత స్టంట్లు ప్రాణాలకు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి