గుజరాత్‌లో విద్యుదాఘాతానికి గురైన పాముకు మౌత్-టు-మౌత్ సీపీఆర్… రక్షకుడు ముఖేష్ వైరల్

గుజరాత్‌ రాష్ట్రంలోని వల్సాద్ జిల్లాలో ఆశ్చర్యం కలిగించే అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యుదాఘాతానికి గురై ప్రాణం పెట్టుకున్నట్టుగా కనిపించిన ఓ పామును వన్యప్రాణి రక్షకుడు ముఖేష్ వయాడ్ మౌత్-టు-మౌత్ సీపీఆర్ అందించి మళ్లీ ప్రాణం పోశాడు. ఈ విస్మయకర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ లక్షలాది మంది దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పామునికి సీపీఆర్ ఇచ్చిన ఘటన చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతూ ముఖేష్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ సంఘటన స్థానిక వ్యవసాయ కూలీల ఎదుటే జరిగింది. ఉదయం పొలాల్లో పని చేస్తుండగా, ఓ పాము విద్యుత్ స్తంభం ఎక్కుతున్నట్టు వారు గమనించారు. వాళ్లు స్పందించేలోపే అది హై వోల్టేజ్ తీగను తాకి భారీ విద్యుద్ఘాతానికి గురైంది. వెంటనే సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయింది. పూర్తిగా నిస్సత్తువగా కనిపించిన పామును చూసి కూలీలు దిగ్భ్రాంతికి గురయ్యారు. అది మళ్లీ బ్రతకాలి అనే ఆలోచనతో వెంటనే సహాయం కోసం ప్రయత్నించారు.

సమీప గ్రామాల్లో వన్యప్రాణి సంరక్షకుడు, స్నేక్ క్యాచర్‌గా పేరొందిన ముఖేష్ వయాడ్‌కు సమాచారం ఇచ్చారు. ప్రాంతంలో పాములు కనిపించినప్పుడల్లా ఆయననే సంప్రదించడం అక్కడి ప్రజలకు అలవాటే. అంతేకాక, అత్యవసర సీపీఆర్‌పై గ్రామాల్లో అవగాహన శిబిరాలు నిర్వహించడంలో కూడా ఆయనే ముందుంటారు.

వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ముఖేష్, విద్యుత్ షాక్ తీవ్రతను పరిశీలించి, అది ఇంకా బ్రతికే అవకాశం ఉందని అంచనా వేశారు. సమయం వృథా చేయకుండా పాముకు మౌత్-టు-మౌత్ సీపీఆర్ ప్రారంభించారు. నోటి ద్వారా ఊపిరి అందిస్తూ పామును రక్షించాలని ప్రయత్నించారు. కొద్ది సేపటికి పాము శరీరంలో స్వల్ప కదలికలు కనిపించాయి. ఆ తరువాత పూర్తిగా చలనం వచ్చి, ఎటూ చూస్తూ జరజరమని పాకుతూ సమీప అడవిలోకి వెళ్లిపోయింది.

ముఖేష్ వయాడ్ చేసిన ఈ సాహసోపేత చర్యకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో పేలవేస్తూ వైరల్ అవుతోంది. ఆయన ధైర్యాన్ని, జంతువుల పట్ల చూపిన కరుణను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి