ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జ్వరంతో బాధపడుతున్నారని సమాచారం. వైద్యుల సూచన మేరకు ఆయనకు ఈరోజు పూర్తి విశ్రాంతి అవసరమని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఈరోజు జరగాల్సిన పులివెందుల పర్యటనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను జగన్ రద్దు చేశారు. వైసీపీ పార్టీ అధికారికంగా ట్విటర్ ద్వారా జగన్ ఆరోగ్య పరిస్థితిని వివరించింది.
పార్టీ వర్గాల ప్రకారం, జగన్ ఆరోగ్యం కోలుకున్న తర్వాత మాత్రమే పులివెందుల పర్యటనలో మిగిలిన కార్యక్రమాలను కొనసాగిస్తారు. వైఎస్ జగన్ త్వరగా కోలుకుని ప్రజా కార్యక్రమాల్లో తిరిగి పాల్గొనాలని పార్టీ సభ్యులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.



