చలికాలం మొదలయ్యే సరికి చాలామందికి హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువవుతుంది. వాతావరణ మార్పులు, శరీరంలో జరిగే కొన్ని సహజ మార్పులే ఈ సమస్యకు కారణమని న్యూట్రిషనిస్ట్ లిమా మహాజన్ చెబుతున్నారు. చలికాలంలో జుట్టు రాలడానికి ప్రధానంగా మూడు కారణాలు ఇవే.
1) రక్త ప్రసరణ తగ్గడం
చలిలో శరీరం వేడి నిలుపుకోవడానికి చిన్న రక్తనాళాలు ఇరుకుగా మారుతాయి (Vasoconstriction).
దీంతో జుట్టు మూలాలకు సరైన పోషకాలు, ఆక్సిజన్ చేరకుండా హెయిర్ ఫాల్ పెరుగుతుంది.
ఏం చేయాలి?
- రోజూ 4 నిమిషాలు తలకు తేలికగా మసాజ్ చేయడం
- రోజుకు 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం
- బయటకు వెళితే తల కవర్ చేసుకోవడం (చెమటలు పట్టేలా బిగుసుగా కాకుండా)
- వాల్‌నట్స్, బీట్‌రూట్, పాలకూర, దానిమ్మ వంటి రక్త ప్రసరణ పెంచే ఆహారం తీసుకోవడం
2) పొడి గాలులు – చుండ్రు పెరుగుదల
చలి సీజన్‌లో తల చర్మం సహజ తేమను కోల్పోతుంది.
పొడి తల చర్మం చుండ్రుకు, దురదకు, చివరకు హెయిర్ ఫాల్‌కు దారితీస్తుంది.
ఏం చేయాలి?
- గోరువెచ్చని నీటితో తల స్నానం
- వేడి నీరు ఎక్కువగా వాడకూడదు
- టోపీలు ఎక్కువసేపు బిగుసుగా ధరించకూడదు
- వారానికి 1-2 సార్లు యాంటీ-డాండ్రఫ్ షాంపూ
- అవిసె గింజలు, పెరుగు, వాల్‌నట్స్ వంటి తేమను పెంపొందించే ఆహారం
3) సూర్యరశ్మి తగ్గిపోవడం – Vitamin D లోపం
చలికాలంలో సూర్యరశ్మి తగ్గడం వల్ల Vitamin D తగ్గుతుంది.
ఇది జుట్టు పెరుగుదలకు అవసరం.
లోపం ఉంటే మూలాలు బలహీనపడి జుట్టు రాలడం పెరుగుతుంది.
ఏం చేయాలి?
- వారానికి 3-4 రోజులు మధ్యాహ్నం సూర్యరశ్మిలో 10-20 నిమిషాలు గడపాలి
- Vitamin D Sources:
- సాల్మన్ చేప
- పుట్టగొడుగులు
- కాడ్ లివర్ ఆయిల్
- నారింజ
న్యూట్రిషనిస్ట్ సూచన
సరైన ఆహారం + తల చర్మ సంరక్షణ + తగిన సూర్యరశ్మి
ఇవన్నీ అలవాటు చేసుకుంటే చలికాలంలో హెయిర్ ఫాల్‌ను నియంత్రించవచ్చు.
గమనిక
ఇది సాధారణ సమాచార ప్రయోజనాలకే. ఏ సమస్య కొనసాగితే వైద్య నిపుణుల్ని సంప్రదించాలి.



