“స్విస్ బ్యాంక్” అంటే ఏమిటి అనేది మనలో చాలా మందికి తెలిసి ఉండదు.ఈ మాట సినిమాల్లో వినడమే తప్ప ఈ స్విస్ బ్యాంకులో బాగా డబ్బు ఉన్నవారు, అక్రమంగా సంపాదించిన అధిక డబ్బును ఈ స్విస్ బ్యాంకులో దాచుకుంటారని ఇంతవరకే తెలుసు. అవును ఇప్పుడు మనం ఈ స్విస్ బ్యాంకులో నగదు దాచుకుంటే పరిస్థితి ఏమిటి.మన భారతీయుల్లో చాలామంది ఇక్కడే డబ్బు దాస్తుంటారు.మన వాళ్ళు ఇక్కడ ఎంత డబ్బు దాచారు అనేది తెలుసుకుందాం.
స్విట్జర్లాండ్లో ఉన్న బ్యాంకును స్విస్ బ్యాంకులు అని అంటారు.ఈ బ్యాంకులు ప్రత్యేకత విషయానికి వస్తే స్విస్ బ్యాంకు ఎకౌంట్ ఖాతాల వివరాలు చాలా గోప్యంగా ఉంటాయి. అక్కడి ఖాతాదారులకు తాము దాచుకున్న ఎంత నగదు అయినా కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉంటాయి.అందుకే ఇక్కడి స్విస్ బ్యాంకులు అనేవి ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రసిద్ధిత కలిగి ఉన్నాయి.ఈ బ్యాంకులకు ఉన్న అతిపెద్ద లక్షణం ఏమంటే వీటి కస్టమర్ల సమాచారం ఏ వ్యక్తికిగానీ లేదా ఆయా దేశాల ప్రభుత్వాలకు ఇవ్వడం అనేది పొరపాటున కూడా జరగదు.ఇకపోతే స్విస్ బ్యాంకు లు అనేవి 17వ శతాబ్దం లో అక్కడ ప్రారంభించబడ్డాయి. 1713లో కష్టమర్ల ఖాతాల విషయంలో గోప్యత కలిగి ఉండేలా ఓ చట్టం రూపొందించడం జరిగిందని అంటారు.ఈ విధానమే ఈ బ్యాంకుల ఖ్యాతిని మరింత బలోపేతం చేశారు.ఇక్కడ అయితే కస్టమర్ల యొక్క అకౌంట్లను ప్రత్యేక నంబర్ ద్వారా గుర్తిస్తారు, దీనినే ‘నంబర్డ్ అకౌంట్’ అని కూడా పిలుస్తారు.ఇక ప్రపంచంలోని ధనవంతులు ఇక్కడ స్విస్ బ్యాంకులను ఇష్టపడటానికి ఇదే ఒక ముఖ్య కారణంగా చెబుతారు.
ఇక మన ఇండియన్స్ కు చెందిన స్విస్ బ్యాంకు ఖాతాల యొక్క వివరాలు,ఆయా ఖాతాలకు చెందిన డిపాజిట్లు పరిశీలించి చూస్తే రూ.3,675 కోట్లు స్విస్ బ్యాంకుల్లో ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది. దాదాపు రూ.3,675 కోట్లు అంటే (346 మిలి యన్ స్విస్ ఫ్రాంక్స్)గా ఉన్నాయనేది కొన్ని మీడియా కథనాల ఆధారంగా తెలుస్తున్న సమాచారం. అయితే దీనిని గతంతో పోలిస్తే 11 శాతం పెరిగాయి.అలాగే అక్కడి బ్యాంక్ ఖాతాల్లో ఉన్నటువంటి మొత్తం భారతీయుల సొమ్ములో ఇది 10 శాతానికి సమానంగా ఉన్నదని వివరాలు తెలుస్తున్నాయి. అయితే ఈ మేరకు స్విస్ కు చెందిన జాతీయ బ్యాంక్, ఎస్.ఎన్.బీ,కు అక్కడి బ్యాంకులు ఈ వివరాలను అందించడం జరిగింది.అయితే,స్విస్ బ్యాంకుల్లో మన ఇండియన్స్ కి చెందిన ధనం 2006వ సంవత్సరంలో ఆల్టైమ్ హైనిని మించి దాదాపుగా 6.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్గా నమోదు కాబడినట్లుగా సమాచారం.ఆ తర్వాత క్రమేణా అది తగ్గుతూ వచ్చింది.ఈ సొమ్మును బ్యాంకులు,వ్యక్తులు,సంస్థల ద్వారా వచ్చినట్టుగా ఎస్.ఎన్.బీ, తెలిపింది. డిపాజిట్లు చూస్తే 2007 ఆఖర్లో గరిష్ఠంగా రూ.9,000 కోట్ల అనగా (2.3 బిలియన్ డాలర్లు)ను మించి నమోదయ్యాయి.అలాగే 2018 నుంచి భారత్ మరియు స్విట్జర్లాండ్ మధ్య పన్ను సంబంధిత విషయాల్లో ఆటోమెటిక్ సమాచార మార్పిడి ఒప్పందం కూడా అమల్లోకి వచ్చింది.ఇక దీని ప్రకారం స్విస్ ఆర్థిక సంస్థల్లో ఉన్నటువంటి మన భారతీయులందరి ఖాతాల పూర్తి వివరాలు భారత్కు స్విట్జర్లాండ్ చెప్పాల్సిందే.