పర్యాటకులకు పండగే.. విశాఖ కైలాసగిరిలో దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం

విశాఖపట్నం పర్యాటకులకు మరో కొత్త ఆకర్షణ అందుబాటులోకి వచ్చింది. కైలాసగిరిలో నిర్మించిన దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ అధికారికంగా ప్రారంభమైంది. రూ.7 కోట్లతో నిర్మించిన ఈ గాజు వంతెనను ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు ఉద్వాటన చేశారు.


జర్మన్ గ్లాస్‌తో అత్యాధునిక భద్రత

  • 40mm మందం గల ల్యామినేటెడ్ జర్మన్ గ్లాస్
  • తుఫానులు, గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులనూ తట్టుకునేలా నిర్మాణం
  • 500 టన్నుల బరువును మోయగల సామర్థ్యం

భద్రత పరంగా ఏ సందేహమూ ఉండకుండా అత్యుత్తమ సాంకేతికతను ఉపయోగించారు.


ఒకేసారి 40 మంది టూరిస్టులకు అవకాశం

గ్లాస్ బ్రిడ్జ్ ఒకేసారి 100 మంది భరించగలిగినా,
సేఫ్టీ దృష్ట్యా 40 మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.

ఇక్కడ నిలబడి చూస్తే—

  • పక్కనే ఎత్తైన కొండలు
  • కింద లోయ
  • కొద్దిదూరంలో సముద్రం
    అలా గాల్లో తేలియాడుతున్న అనుభూతి కలుగుతుంది అంటున్నారు సందర్శకులు.

విశాఖను పర్యాటక రాజధానిగా లక్ష్యం

వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ,
విశాఖను దేశంలో ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
త్వరలో త్రిశూల్ ప్రాజెక్ట్ కూడా అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.

రాత్రివేళల్లో గ్లాస్ బ్రిడ్జ్ త్రివర్ణ విద్యుత్ వెలుగులతో మెరిసిపోతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి