తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూరగాయల ధరల్లో తగ్గుదల కాస్త రిలీఫ్ ఇచ్చింది. ముఖ్యంగా రోజూ వంటల్లో ఉపయోగించే టమాటా ధరలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం కేజీ టమాటా రూ.15 నుంచి రూ.20 మధ్య లభిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లో ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.
కొద్ది రోజుల క్రితం వరకు కేజీ టమాటా రూ.40–50 పలికింది. గత వారం రూ.25కి తగ్గగా, ఇప్పుడు మరింత తగ్గి సామాన్యులకు ఊరట కలిగిస్తోంది. ఇతర కూరగాయల ధరలు కూడా స్వల్పంగా తగ్గినా, కాకర వంటి కొన్ని కూరగాయల ధరలు మాత్రం కొద్దిగా పెరిగాయి.
హైదరాబాద్‌లో కూరగాయల ధరలు
హైదరాబాద్ కూకట్‌పల్లి రైతు మార్కెట్‌లో
- టమాటా: రూ.17
- బెండకాయ: రూ.35
- వంకాయ: రూ.23
- దొండకాయ: రూ.45
- బీట్‌రూట్: రూ.15
- క్యాబేజీ: రూ.15
- ఆలుగడ్డ: రూ.17
- ఉల్లిగడ్డ: రూ.20
గుంటూరులో ధరలు
గుంటూరు ఎన్టీఆర్ రైతు బజార్‌లో
- టమాటా: రూ.22
- బెండకాయ: రూ.20
- వంకాయ: రూ.25
- పచ్చిమిర్చి: రూ.37
- క్యాబేజీ: రూ.23
- ఉల్లిపాయలు: రూ.25
- ఆకుకూరలు: రూ.5 నుంచి రూ.10
విజయవాడలో ధరలు
విజయవాడ రైతు మార్కెట్‌లో
- టమాటా: రూ.19
- బెండకాయ: రూ.24
- వంకాయ: రూ.25
- పచ్చిమిర్చి: రూ.32
- క్యాబేజీ: రూ.22
- సొరకాయ: రూ.10
- ఉల్లిపాయలు: రూ.24
మొత్తంగా కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో సామాన్యులపై భారం కొంత తగ్గినట్టే కనిపిస్తోంది.



