వాము ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణం నుంచి కళ్ల ఆరోగ్యం వరకు అద్భుత లాభాలు

ఆరోగ్య నిపుణుల మాటల్లో చెప్పాలంటే, వాము ఆకులు సహజ ఔషధంలా పనిచేస్తాయి. రోజూ వాము ఆకులను నమలడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ముఖ్యంగా ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయి. జీర్ణక్రియను సక్రమంగా నడిపించడంలో వాము ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి.

వాము ఆకులను నీటిలో మరిగించి తాగితే శ్వాసకోశ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. దగ్గు, జలుబు, శ్వాసలో ఇబ్బందులు వంటి సమస్యలను తగ్గించడంలో ఇది సహాయకారి. అంతేకాదు, వాము ఆకులు రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కలిగి ఉండటంతో శరీరం వ్యాధులను ఎదుర్కొనే శక్తిని పొందుతుంది.

వాము ఆకులు మరిగించిన నీటిలో ఇంగువ, నల్ల ఉప్పు కలిపి తీసుకుంటే కడుపు నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. వీటిలో సహజంగా అనాల్జేసిక్ లక్షణాలు ఉండటంతో పంటి నొప్పి, తలనొప్పి, శరీర నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఆకులను మెత్తగా నూరి ప్రభావిత ప్రాంతంపై లేపంగా రాస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

వాము ఆకులతో రుచికరమైన చట్నీని కూడా తయారు చేసుకోవచ్చు. ఆకులను వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొద్దిగా నిమ్మరసంతో కలిపి చట్నీగా చేసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా వాము ఆకుల రసం లేదా చట్నీ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

రోజూ రెండు వాము ఆకులు నమలడం వల్ల శరీరంలోని మెటబాలిజం రేటు పెరుగుతుంది. దీంతో బరువు నియంత్రణలో ఉండటానికి ఇది సహాయపడుతుంది. అలాగే వాము ఆకుల రసం ఆర్థరైటిస్ వంటి కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడేవారికి ఎంతో ప్రయోజనకరం. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల వాపులు, నొప్పులను తగ్గిస్తాయి.

కళ్ల ఆరోగ్యానికి కూడా వాము ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటంతో కంటి చూపును కాపాడుతుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే చూపు మెరుగుపడే అవకాశం ఉంది. అలాగే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్లు తదితర ఖనిజాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలను వాము ఆకులు దూరం చేస్తాయి. జీవక్రియ సక్రమంగా సాగేందుకు సహకరిస్తాయి. అంతేకాదు, వాము ఆకులు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు కూడా కొంత మేర నియంత్రణలోకి వచ్చే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం మీద, వాము ఆకులు రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి బహుముఖ ప్రయోజనాలు కలుగుతాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి