TS Inter 2026 Exams: షెడ్యూల్ ప్రకటించిన బోర్డు, 9.8 లక్షల మంది విద్యార్థులు సిద్ధం

తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 ఫిబ్రవరి చివరి వారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ఇప్పటికే విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 9.8 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇప్పటి వరకు 9,79,506 మంది విద్యార్థులు ఫీజు చెల్లించినట్లు బోర్డు వెల్లడించింది.

అధికారిక సమాచారం ప్రకారం వార్షిక ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు నిర్వహించనున్నారు. ఫీజు చెల్లింపులకు డిసెంబర్ 15 వరకు ఆలస్య రుసుం రూ.2,000తో అవకాశం కల్పించారు.

ఫీజు వివరాలు

  • ఫస్ట్ ఇయర్ జనరల్ కోర్సు: రూ.630
  • ఫస్ట్ ఇయర్ ఒకేషనల్: రూ.870
  • సెకండ్ ఇయర్ ఆర్ట్స్: రూ.630
  • సెకండ్ ఇయర్ సైన్స్ / ఒకేషనల్: రూ.870
  • ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష: రూ.100 అదనంగా

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ షెడ్యూల్ 2026

  • ఫిబ్రవరి 25: Part-I Second Language Paper-I
  • ఫిబ్రవరి 27: Part-II English Paper-I
  • మార్చి 2: Maths 1A / Botany / Political Science
  • మార్చి 5: Maths 1B / Zoology / History Paper-I
  • మార్చి 9: Physics / Economics Paper-I
  • మార్చి 13: Chemistry / Commerce Paper-I
  • మార్చి 17: Modern Language / Geography Paper-I

ఇంటర్ సెకండ్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ షెడ్యూల్ 2026

  • ఫిబ్రవరి 26: Part-II Second Language Paper-II
  • ఫిబ్రవరి 28: Part-I English Paper-II
  • మార్చి 3: Maths 2A / Botany / Political Science Paper-II
  • మార్చి 6: Maths 2B / Zoology / History Paper-II
  • మార్చి 10: Physics / Economics Paper-II
  • మార్చి 13: Chemistry / Commerce Paper-II
  • మార్చి 16: Public Administration / Bridge Course Maths
  • మార్చి 18: Modern Language / Geography Paper-II
Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి