పర్యాటక, పుణ్యక్షేత్ర యాత్రలు చేయాలనుకునే వారికి టీజీఎస్ఆర్టీసీ తీపికబురు చెప్పింది. గోవా, శ్రీశైలం, అరుణాచలం, మేడారం వంటి ప్రముఖ ప్రాంతాలకు తక్కువ ధరకే ప్రత్యేక టూర్ ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొచ్చింది. సామాన్య ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఈ ప్యాకేజీలను రూపొందించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
కోల్హాపూర్ – పండరీపూర్ స్పెషల్ టూర్
ఈ నెల 23వ తేదీ నుంచి కోల్హాపూర్, పండరీపూర్, గానుగాపూర్, తుల్జాపూర్ ప్రాంతాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రారంభమవుతుంది.
- ప్రారంభ స్థలం: హైదరాబాద్ BHEL
- టూర్ వ్యవధి: 3 రోజులు
- ప్యాకేజీ ధర: రూ.3,000
ఈ టూర్లో పాల్గొనదల్చుకున్నవారు 9391072283, 9063401072 నంబర్లను సంప్రదించవచ్చు.
గోవా టూర్ ప్యాకేజీ
ఇక ఫిబ్రవరి 6 నుంచి గోవా టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
- టూర్ వ్యవధి: 5 రోజులు
- ప్యాకేజీ ధర: రూ.3,500
- సందర్శించే ప్రాంతాలు: గోవా, హంపి, తుల్జాపూర్
గోవా టూర్ కోసం కూడా ఇదే నంబర్లలో సంప్రదించవచ్చు. టికెట్లను టీజీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ లేదా బస్సు రిజర్వేషన్ కౌంటర్లలో ముందుగానే బుక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు
ఈ నెలలో మేడారం మహా జాతర ప్రారంభం కానుండటంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల నుంచి స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఛార్జీల వివరాలను ఇప్పటికే ప్రకటించింది.



