TGSRTC Jobs 2026: ఆర్టీసీ ఉద్యోగాలకు గడువు పొడిగింపు లేదు.. జనవరి 20 చివరి తేదీ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఉద్యోగాలపై నిరుద్యోగులకు కీలక అప్డేట్ ఇచ్చింది. ఇటీవల విడుదలైన ఆర్టీసీ ఉద్యోగాల నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు గడువు పొడిగిస్తారు అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీజీఎస్‌ఆర్టీసీ అధికారికంగా స్పందిస్తూ స్పష్టత ఇచ్చింది.

హైదరాబాద్‌, జనవరి 8:
టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్ వివి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్ణయించిన తుది గడువులోపే అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి అవకాశం ఇవ్వబోమని తేల్చి చెప్పారు.

తెలంగాణ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 198 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరు చివరిలో నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో

  • ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (TST)
  • మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (MST)

పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 31 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.

దరఖాస్తుల చివరి తేదీ:
జనవరి 20, సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే

దీనిని మించి గడువు పొడిగింపు ఉండదని అధికారులు మరోసారి స్పష్టం చేశారు.

దరఖాస్తు ఫీజు వివరాలు:

  • జనరల్ అభ్యర్థులు: రూ.800
  • SC / ST అభ్యర్థులు: రూ.400

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష
  • సర్టిఫికెట్ల వెరిఫికేషన్
  • ఇతర దశల ద్వారా ఎంపిక

జీతభత్యాలు:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు
రూ.27,080 నుంచి రూ.81,400 వరకు జీతం చెల్లిస్తారు.

అభ్యర్థులు గడువు ముగిసేలోపు తప్పనిసరిగా దరఖాస్తు పూర్తి చేయాలని, పూర్తి వివరాల కోసం టీజీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి