తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పరీక్షలను ముందుగానే నిర్వహించనున్నారు. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా షెడ్యూల్‌ను బోర్డు రూపొందించింది.
ఇంటర్మీడియట్ సిద్ధాంత (థియరీ) పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ప్రారంభమై మార్చి 18వ తేదీ వరకు కొనసాగుతాయని బోర్డు ప్రకటించింది. ఇక ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుండి ఫిబ్రవరి 21 వరకు జరుగుతాయి. ఈ పరీక్షలు ప్రభుత్వ రంగ కాలేజీలలోనే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఫస్ట్ ఇయర్ షెడ్యూల్
- జనవరి 21: ఇంగ్లీష్ ప్రాక్టికల్
- జనవరి 23: ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్
- జనవరి 24: ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్
థియరీ పరీక్షలు:
- ఫిబ్రవరి 25: పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ -1)
- ఫిబ్రవరి 27: పార్ట్ 2 (ఇంగ్లీష్ పేపర్ -1)
- మార్చి 2: మ్యాథ్స్ 1ఏ / బోటనీ / పొలిటికల్ సైన్స్ -1
- మార్చి 5: మ్యాథ్స్ 1బీ / జువాలజీ / హిస్టరీ -1
- మార్చి 9: ఫిజిక్స్ / ఎకానమిక్స్ -1
- మార్చి 13: కెమిస్ట్రీ / కామర్స్ -1
- మార్చి 17: మోడ్రన్ లాంగ్వేజ్ -1 / జియోగ్రఫీ -1
సెకండ్ ఇయర్ షెడ్యూల్
- ఫిబ్రవరి 26: పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2)
- ఫిబ్రవరి 28: పార్ట్ 1 (ఇంగ్లీష్ పేపర్ -2)
- మార్చి 3: మ్యాథ్స్ 2ఏ / బోటనీ / పొలిటికల్ సైన్స్ -2
- మార్చి 6: మ్యాథ్స్ 2బీ / జువాలజీ / హిస్టరీ -2
- మార్చి 10: ఫిజిక్స్ / ఎకానమిక్స్ -2
- మార్చి 13: కెమిస్ట్రీ / కామర్స్ -2
- మార్చి 16: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ -2
- మార్చి 18: మోడ్రన్ లాంగ్వేజ్ -2 / జియోగ్రఫీ -2
విద్యార్థుల సంఖ్య & ఏర్పాట్లు
ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరుకానున్నారు. అందులో 4.20 లక్షల మంది ప్రాక్టికల్ పరీక్షలు రాయనున్నారు. బోర్డు అధికారులు ప్రాక్టికల్ పరీక్షలు సాఫీగా జరిగేలా ఇప్పటికే కేంద్రాల ఎంపిక, పర్యవేక్షణ బృందాల నియామకంపై ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.



