తమిళనాడులో సంచలనం: మనిషిని పోలిన మేక పిల్ల పుట్టి గ్రామంలో కలకలం

తమిళనాడులో అరుదైన, ఆశ్చర్యపరిచే సంఘటన వెలుగులోకి వచ్చింది. కల్లకురిచ్చి జిల్లా ఉళుందూర్‌పేట సమీపంలోని సేందమంగళం గ్రామంలో, మనిషిని పోలిన ఆకారంతో మేక పిల్ల పుట్టి గ్రామస్థులను, చుట్టుపక్కల ప్రజలను విస్తుపోయేలా చేసింది. ఈ విస్మయకరమైన దృశ్యాన్ని చూడటానికి సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

గ్రామానికి చెందిన రైతు ఆనందన్‌ (38)కు 20కి పైగా మేకలు ఉన్నాయి. ఇటీవల అతని పశువులలో ఒక మేక రెండు పిల్లలకు జన్మనిచ్చింది. వాటిలో ఒకటి సాధారణ మేక పిల్లగా పుట్టగా, మరొకటి మనిషి ముఖాకారానికి దగ్గరగా ఉండే లక్షణాలతో పుట్టి, పుట్టిన వెంటనే మృతిచెందింది. ఈ విషయం గ్రామంలో వేగంగా వ్యాపించి, ఆసక్తిగా చూడటానికి జనాలు తండోపతండాలుగా చేరుకున్నారు.

స్థానికులు, ఈ ఘటనను చూసి, ఇది తమ జీవితంలో మొదటిసారి ఎదురైన అనుభవమని చెబుతున్నారు. ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ అవ్వడంతో ఈ సంఘటన రాష్ట్రం దాటిపోయి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొందరు నెటిజెన్లు దీన్ని ప్రకృతి అద్భుతమని పేర్కొంటుండగా, మరికొందరు “కాలజ్ఞానం నిజమవుతోంది” అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

ఇంతకుముందు, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామంలో ఓ చింత మొక్క తనంతట తాను కదిలిన సంఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, తమిళనాడులో చోటుచేసుకున్న ఈ మానవ పోలికల మేక పిల్ల పుట్టిన ఘటన ప్రజలలో కొత్త చర్చలకు దారితీస్తోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి