తమన్నా షాకింగ్ రివిలేషన్: సౌత్ స్టార్ హీరోతో జరిగిన చేదు అనుభవం..! చివరికి హీరో క్షమాపణలు

tamanna-south-star-hero-clash-apology

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన తమన్నా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక షాకింగ్ విషయం బయట పెట్టింది. తన కెరీర్‌లో ఒకసారి ఓ ప్రముఖ స్టార్ హీరోతో నటిస్తున్న సమయంలో జరిగిన చేదు అనుభవాన్ని ఆమె పంచుకుంది.

తమన్నా చెప్పిన ప్రకారం — ఆ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు తనకు అసౌకర్యంగా అనిపించాయి. అందుకే, సూటిగా ఆ హీరోకి “సార్, నేను ఈ సీన్లు చేయలేను” అని చెప్పింది. కానీ, ఈ స్పందన ఆ హీరోకి అసలు నచ్చకపోవడంతో, కోపంతో “ఇంకా ఈ హీరోయిన్ అవసరం లేదు, వెంటనే మార్చేయండి” అంటూ దర్శకుడు, నిర్మాతలకి చెప్పి, తనపై అరిచి సెట్ నుంచి వెళ్లిపోయారట.

ఈ సంఘటన తమన్నాకు చాలా బాధ కలిగించిందని ఆమె తెలిపింది. అయితే, మరుసటి రోజే ఆ స్టార్ హీరో తన దగ్గరకు వచ్చి, “సారీ అండి, నేను అలా ప్రవర్తించినందుకు క్షమించండి” అని చెప్పారని తమన్నా వెల్లడించింది.

ఈ వ్యాఖ్యలు విన్న నెటిజన్లు మాత్రం ఆ హీరో ప్రవర్తనపై మండిపడుతున్నారు. “హీరోయిన్లను ఇలా చులకనగా చూడటమేంటి?”, “తమకు నచ్చిన సీన్లు చేయమని ఒత్తిడి తేవడం ఏంటి?”, “ఆడవాళ్లను ఆటబొమ్మల్లా చూడకూడదు” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి