ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం సీడాప్, డీడీయూ-జీకేవై ద్వారా ఉచిత శిక్షణ అందిస్తోంది. 18–35 ఏళ్ల మధ్య ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివిన వారికి వేర్‌హౌస్‌ సూపర్‌వైజర్‌, కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ వంటి కోర్సుల్లో శిక్షణతో పాటు ఫుడ్, హాస్టల్ ఉచితం. శిక్షణ అనంతరం రూ.36,000 నుంచి రూ.64,000 వరకు జీతం వచ్చే ఉద్యోగాలు కల్పిస్తున్నారు.