తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. జూలై 14న సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తిలో కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో 2 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు కార్డులు అందనుండగా, ఈ సారి స్మార్ట్ టెక్నాలజీతో రూపొందించిన రేషన్ కార్డులు ఇవ్వనున్నారు.