సంక్రాంతికి విజయవాడలో ‘ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్’ – ఫ్రీ పాస్‌ల కోసం వెబ్‌సైట్ ప్రారంభం

సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడలో ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్ నిర్వహించనున్నారు. పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్‌లో జరిగే ఈ వేడుకలకు ఫ్రీ పాస్‌ల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించారు.

అమరావతి బ్రాండ్‌కు ఊపిరి: విజయవాడలో ‘ఆవకాయ’ సాంస్కృతిక ఉత్సవం ప్రారంభం

అమరావతి బ్రాండ్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆవకాయ’ పేరుతో సరికొత్త సాంస్కృతిక ఉత్సవాన్ని విజయవాడలో నిర్వహించనుంది. జనవరి 8 నుంచి 10 వరకు జరగనున్న ఈ ఫెస్టివల్‌లో సినిమా, సాహిత్యం, కళలు ఒకే వేదికపై సందడి చేయనున్నాయి.