ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజుల్లో ప్రైవేట్ పాఠశాలల దోపిడీపై ప్రభుత్వం సీరియస్ అయింది. రూ.125 రుసుము స్థానంలో రూ.900 వరకు వసూలు చేస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థులు నేరుగా బోర్డ్ సెకండరీ వెబ్‌సైట్‌లో ఫీజులు చెల్లించే అవకాశం కల్పించారు.