MS Dhoni Amaravati Visit: చంద్రబాబుతో భేటీ.. ఏపీలో క్రికెట్ అకాడమీపై కీలక చర్చ

భారత క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని ఈ నెల 9న అమరావతికి రానున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీలో ఏపీలో క్రికెట్ అభివృద్ధి, క్రికెట్ అకాడమీ ఏర్పాటు అంశాలపై చర్చ జరిగే అవకాశం.

అమరావతిలో ఎం.ఎస్.కె ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ – ప్రపంచ స్థాయి క్రీడా సముదాయం త్వరలో

భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎం.ఎస్.కె ప్రసాద్ ఆధ్వర్యంలో అమరావతిలో “ఎం.ఎస్.కె ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ” ప్రారంభమవుతోంది. 12 ఎకరాల్లో ప్రపంచ స్థాయి సదుపాయాలతో నిర్మాణం జరగనుంది. స్థానిక ప్రతిభకు జాతీయ స్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యం.