ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం: ‘జీరో ఫేరు టిక్కెట్’ ఆదేశించిన సీఎం చంద్రబాబు

ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకంగా ‘జీరో ఫేరు టిక్కెట్’ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రయాణ వివరాలు, ఆదా అయిన డబ్బు వంటి సమాచారం టికెట్‌పై పొందుపరచాలని సూచించారు.

చంద్రబాబు హెలికాప్టర్‌కు వాతావరణ అడ్డంకి: గన్నవరంలో ల్యాండింగ్, కార్యక్రమంలో మార్పులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. హెలికాప్టర్ వాతావరణం కారణంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. తర్వాత ప్రత్యేక విమానంతో రాజమండ్రి చేరుకుని, రోడ్డుమార్గంలో మలకపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.