ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రోజుల్లో భారీ వర్షాల సూచన. రాయలసీమలో పిడుగులు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. సెప్టెంబర్ 26న ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, 27న వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.