భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నీటిమట్టం 37 అడుగులకు చేరింది. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, పినపాక తదితర ప్రాంతాల్లో ముంపు ముప్పు కొనసాగుతోంది.
Tag: వరద హెచ్చరిక
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది – ప్రజలు అప్రమత్తంగా ఉండండి!
శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్‌ల నుండి భారీ వరద నీరు విడుదల కావడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. NDRF, SDRF సిబ్బంది సిద్దంగా ఉంచుతూ ప్రజలను ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.