నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో ఉన్న కాకరాల సునీత, చెన్నూరి హరీశ్‌లకు రాచకొండ పోలీసులు పునరావాస ప్యాకేజీ అందించారు. సునీతకు రూ.20 లక్షలు, హరీశ్‌కు రూ.4 లక్షల చెక్కులు ఇవ్వడంతో పాటు ఇండిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని సీపీ సుధీర్ బాబు హామీ ఇచ్చారు.