డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. నరసాపురం–సఖినేటిపల్లి మధ్య వశిష్ఠ గోదావరిలో 100 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న పంటు ఇంజిన్ లోపంతో నది మధ్యలో నిలిచిపోయింది. ప్రవాహం వేగంగా ఉండటంతో సాగర సంగమం వైపు కొట్టుకుపోతుండగా మరో పంటు వచ్చి సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది.