తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఘనత సాధించింది. హైదరాబాద్ సరూర్నగర్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకున్నాయి. 63 అడుగుల భారీ బతుకమ్మ, ఒకేసారి 1354 మంది మహిళల జానపద నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.