గుంటూరులో ఆదివారం కేవలం రెండు గంటల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. వర్షంతో రహదారులు చెరువులను తలపించి, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. నాగార్జునసాగర్, శ్రీశైలం, పోలవరం ప్రాజెక్టుల్లోనూ భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.