గుజరాత్ పోర్‌బందర్ తీరంలో భారీ సరుకు రవాణా నౌకలో మంటలు చెలరేగి తీవ్ర కలకలం రేపాయి. మంటలు అదుపులోకి రాకపోవడంతో అధికారులు నౌకను సముద్రంలోకి తరలించారు. సంఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.