అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అక్రమాల కేసులో చంద్రబాబు నాయుడు, నారాయణపై కేసు మూసివేతకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయం కోరుతూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది.