అమరావతి పరిధిలోని మంగళగిరి APSP 6వ బెటాలియన్లో రెండవ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పోలీస్ జట్లు పాల్గొంటుండగా, ఈ మ్యాచ్లు ఎన్టీఆర్ జిల్లాలోని ACA స్టేడియంలో 5 రోజుల పాటు జరగనున్నాయి.