ఇండోర్‌కు ఎనిమిదోసారి స్వచ్ఛత గౌరవం
దేశంలో అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇండోర్ నగరం మరోసారి అగ్రస్థానంలో నిలిచి తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఇది వరుసగా ఎనిమిదో సంవత్సరం ఇండోర్‌కు లభించిన గౌరవం. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25 అవార్డుల ప్రకటన మంగళవారం ఢిల్లీలో జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో అవార్డులు అందజేశారు.
ఇండోర్ తర్వాతి స్థానాల్లో గుజరాత్‌కు చెందిన సూరత్ రెండో స్థానం, మహారాష్ట్ర రాజధాని ముంబయి మూడో స్థానంలో నిలిచాయి.
ఇది కూడా చదవండి 👉 మంగళగిరిలో వేగంగా వంద పడకల ఆసుపత్రి నిర్మాణం
ఏపీ నుంచి ఐదు నగరాలకు గౌరవ బహుమతులు
ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొత్తం ఐదు నగరాలు వివిధ విభాగాల్లో అవార్డులు అందుకున్నాయి:
విశాఖపట్నం
జాతీయ స్థాయిలో “స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డు” అందుకుంది. పరిశుభ్రతలో కష్టపడి నిలిచిన విశాఖకు ఇది పెద్ద గౌరవంగా చెప్పొచ్చు.
రాజమండ్రి
రాష్ట్రస్థాయిలో మినిస్టీరియల్ అవార్డు అందుకుంది. ఇది కూడా శుభపరిష్కారాల్లో చురుకుగా ఉన్న నగరంగా రాజమండ్రిని నిలబెడుతుంది.స్వచ్ఛ సూపర్‌లీగ్ సిటీస్ విభాగంలో
విజయవాడ, తిరుపతి, గుంటూరు నగరాలు ఎంపికయ్యాయి. వీటిలో గుంటూరు నగరం అందుకున్న స్వచ్ఛ సూపర్‌లీగ్ సిటీ అవార్డు రాష్ట్ర స్థాయిలో అత్యంత గౌరవనీయంగా నిలిచింది.
గుంటూరు అవార్డు – రాష్ట్రానికి గర్వకారణం
గుంటూరు నగరానికి లభించిన స్వచ్ఛ సూపర్‌లీగ్ అవార్డు ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణ అందుకున్నారు. అనంతరం మంత్రి నారాయణ చేతుల మీదుగా గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) మరియు రాష్ట్ర స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరాం ఈ అవార్డును స్వీకరించారు.
ఈ విజయాల వెనుక ఉన్న కృషి
స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా నగరాల పరిశుభ్రతపై రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, స్థానిక మున్సిపాలిటీల కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. ప్రజల సహకారం, కార్మికుల కృషి, అధికారుల పర్యవేక్షణ – ఇవన్నీ కలిసి ఈ పురస్కారాల వైపు దారి చూపించాయి.



