నీతి-నిజాయితీలు అనేవి ఓ చిన్న పిల్లాడిని సూపర్ స్టార్ రజనీకాంత్ ఒడిలో కూర్చునే విధంగా చేయడ మే కాదు,ఆ పిల్లాడికి ఓ గొప్ప అద్భుతమైన అవకాశం చేజిక్కించుకునేలా చేసింది.అవును పై ఫొటో లో ‘తలైవా’ ఒడిలో కూర్చున్న ఆ పిల్లాడు చేసిన పని అందరికి అందరికి స్ఫూర్తి కావాలి.ఈ కధనంలోకి ఒక్కసారి కళ్ళుపెట్టి చదివి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇప్పుడు ఈ పిల్లవాడు తమిళనాడులో నిజాయితీ కి నిలువెత్తు నిదర్శనమై నిలిచాడు.పేరు మహ్మద్ యాసిన్.ఈ బాలుడికి తమిళనాడులో ఓ రోడ్డుపై 50 వేల రూపాయలు నగదు దొరికింది.డబ్బు దొరికింది కదా అని అతను ఆ డబ్బు దాచుకోలేదు. నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆ డబ్బును అక్కడ ఉన్న పోలీసు అధికారికి ఇచ్చి సార్ నాకు ఈ డబ్బు రోడ్డు పై దొరికింది.ఈడబ్బు పోగొట్టుకున్న వారు ఎవరో నాకు తెలియదు.ఆ డబ్బు ఎవరివో తెలుసుకుని ఆ నగదు యజమాని ఎవరో కనుగొని దానిని తిరిగి వారికి ఇవ్వండి అని, అన్నాడు. దానికి పోలీస్ అధికారి ఆ పిల్లవాడిని ఈ డబ్బును నువ్వు ఎందుకు ఉంచుకోలేదని అడిగాడు.అంటే దానికి యాసిన్ ఈ డబ్బు ఎవరో కష్టపడి సంపాదించిన డబ్బు నాది కాదని దానిని నా దగ్గర ఎలా ఉంచుకోగలనని బదులిచ్చాడు.
అప్పుడు ఆ పిల్లాడు నిజాయితీని మెచ్చిన పోలీసు అధికారి వెంటనే నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్ప మని యాసిన్ ను అడిగాడు ఆ పోలీసు అధికారి. వెంటనే యాసిన్ నాకు సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలవాలనే కోరిక ఉందని చెప్పాడు.వెంటనే పోలీసులు ఈ విషయాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ కు తెలియజేయగా అందుకు స్పందించిన రజనీకాంత్ యాసిన్ ను తన వద్దకు తీసుకురమ్మని వారికి తెలి పారు.ఈ సందర్బంగా రజ నీకాంత్ ఆ పిల్లవాడి తల్లి దండ్రులతో ఈ పిల్ల వాడి చదువు ఖర్చులన్నింటినీ తాను భరిస్తానని వాగ్దానం చేశారు.
ఆ పిల్లాడు ఈ ప్రపంచం లోనే అత్యంత ఖరీదైన పాఠశాల/కళాశాలలో చదువుకోవచ్చని రజనీ కాంత్ చెప్పారు.ఇప్పటి నుండి నేను ఈ బిడ్డను నా సొంత కొడుకులా చూసుకుంటానన్నారు.నిజాయితీ అనేది పుట్టుకతోనే ఉంటుంది,కులం మరియు మతం ద్వారా కాదని సూ పర్ స్టార్ రజనీకాంత్ అన్నారు.చివరిగా చిన్న పిల్లల్లో ఇలా నీతి-నిజాయితీతో పాటు సమాజం పట్ల బాధ్యత ఉండటం చాలా గొప్ప విషయం అని అన్నారు.అందులోనూ ఎవరు నగదు పోగొట్టుకున్న ఇంత నగదు ఎంత కష్ట పడితే సంపాదించగలరు అనుకుని నీతిగా నిజాయితీ తో అంత డబ్బు పోలీసులకు అప్పగించి సామాజిక బాధ్యతతో,ఆ నగదును పోగొట్టుకున్న వారికి అప్పగించాలని కోరిన చిన్నారికి రజనీ కాంత్ ఇచ్చిన అవ కాశంపై చాలామంది ప్రశంసలు కురిపించారు.