శ్రీశైలం భక్తులకు తృటిలో ప్రమాదం తప్పింది – మంటల్లో కాలిన కారు, ప్రాణాలతో బయటపడ్డ కుటుంబం

శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్తున్న భక్తులు ఓ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో క్షణాల్లోనే అగ్నికి ఆహుతయింది. అయితే, డ్రైవర్ అప్రమత్తతతో అందరూ సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం కృష్ణగిరి (ఈగలపెంట) గ్రామ సమీపంలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం – హైదరాబాద్‌లోని చిక్కడపల్లికి చెందిన ఆకుల ప్రణవ్‌కుమార్ తన భార్య జయశ్రీ, కుమార్తెలు తేజశ్రీ, శ్రీవల్లి, వాంగ్మయి లతో కలిసి శ్రీశైలం దర్శనానికి బయలుదేరారు. వాహనం కృష్ణగిరి గ్రామ సమీపానికి చేరుకోగానే ఇంజిన్‌ నుంచి ఒక్కసారిగా పొగలు రావడం ప్రారంభమైంది.

తక్షణమే అప్రమత్తమైన ప్రణవ్‌కుమార్ కారు రోడ్డు పక్కన ఆపి కుటుంబ సభ్యులందరినీ కిందకు దింపాడు. వారు దిగిన కొద్దిసేపటికే కారు పూర్తిగా మంటల్లో కాలి బూడిదైపోయింది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. డ్రైవర్ సకాలంలో తీసుకున్న నిర్ణయమే పెద్ద ప్రమాదాన్ని తప్పించిందని ఎస్సై జయన్న తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి