శ్రీ విష్ణు నటించిన సింగిల్ సినిమా ఓటీటీలోకి వచ్చాక, ఈ సినిమా అసలు నెక్స్ట్ లెవల్ ట్రోలింగ్ హ్యాండ్‌బుక్ లా మారిందని నెటిజన్లు చెబుతున్నారు. రిలీజ్ ముందు కన్నప్ప, శివయ్యల మాటలతో బాగానే న్యూస్‌లోకి వచ్చి… థియేటర్లో ట్రోల్స్‌తో ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాతే అసలు లోతులు బయటపడుతున్నాయి.
ఇంతకీ ఈ సినిమాతో సోషల్ మీడియా మీమ్ కల్చర్‌నే తెరపైకి తీసుకొచ్చారా? లేక ట్రోలింగ్ పేరుతో స్టార్స్‌నే పరోక్షంగా టార్గెట్ చేశారా? అనే డిబేట్ నడుస్తోంది. నెటిజన్ల విశ్లేషణ చూస్తే మాత్రం… సింగిల్ టీం ఏదో యాక్షన్‌లోకి దిగినట్టే అనిపిస్తోంది!
బన్నీ జంప్?.. వెన్నెల కిషోర్ వర్షన్!
ఓ ఫైటింగ్ సీన్లో అల్లు అర్జున్ తన సినిమా బన్నీలో చేసిన పవర్ఫుల్ జంప్ గుర్తుందా? అదే సీన్‌ని వెన్నెల కిషోర్ చేతా రీ-క్రియేట్ చేయించడం నిజంగా ట్రోలింగ్‌కు మచ్చుతునకగా మారింది. జంప్‌లో ఉన్న ఒవర్ యాక్షన్‌ని హైలైట్ చేస్తూ చేసిన ఈ సీన్, బన్నీ అభిమానుల్లో మిక్స్డ్ రియాక్షన్స్ తెచ్చింది.
‘హ్యాపీ బర్త్ డే రషి’ వీడియోపై సెటైర్?
రష్మిక మంధన్న తన బర్త్‌డే రోజున షేర్ చేసిన ఓ వీడియోపై అప్పట్లో సోషల్ మీడియాలో క్రింజ్ కామెంట్స్ బాగా వచ్చాయి. ఆ వీడియోని కొంతమంది ‘క్యూట్’ అన్నారు, మరికొంతమంది నో కామెంట్‌తో వెళ్లిపోయారు. కానీ సింగిల్ టీం మాత్రం ఈ విషయాన్ని వదల్లేదు! వెన్నెల కిషోర్ చేత “హ్యాపీ బర్త్ డే గాయత్రి” అంటూ అదే వీడియోని సెటైరికల్‌గా రీ-క్రియేట్ చేయించడం నిజంగా మాస్టర్ స్ట్రోక్ అనొచ్చు!
“సిస్టర్.. లానిస్టర్..” – దెబ్బకు అర్ధం అయ్యింది కానీ ఓటీటీలో!
వెన్నెల కిషోర్ ఒక డైలాగ్ చెబుతారు: “సారీ సిస్టర్… ఐ యామ్ లానిస్టర్”. మొదట చూస్తే ఏదో కామెడీగా అనిపించిన ఈ డైలాగ్… గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్‌కు మాత్రం షాకింగ్‌గా తాకింది! ఎందుకంటే “లానిస్టర్” అనగానే అక్కడ ఉన్న సబ్టెక్స్ట్ అర్థం అవుతుంది – అదే ట్రోల్ జోనులోకి తీసుకెళ్లిన సందర్భం.
ట్రోల్స్‌తో నిండి ఉన్న సినిమా?
ఈ సినిమా మొత్తానికి ట్రోలింగ్ ఆధారంగా నిర్మించినట్టు స్పష్టంగా కనబడుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన కంటెంట్‌ని కాపీ పేస్ట్ చేయకుండా, వాటిని తమ శైలిలో మలచుకుని చూపించడం సింగిల్ టీం స్పెషాలిటీ. థియేటర్లో బాగా నవ్వించిన ఈ సీన్లు, ఓటీటీలో మళ్లీ చూసినప్పుడు ‘ఇది ఇదేనా?’ అనే డీటెయిల్స్ తేలిపోయాయి.
చివరికి చెప్పాలంటే, సింగిల్ సినిమా ఓ కామెడీ ఎంటర్టైనర్ మాత్రమే కాదు… ట్రోలింగ్‌కు ట్రిబ్యూట్ లా కూడా నిలిచింది. మీరు మీమ్ లవర్స్ అయితే, ఓటీటీలో ఓ రౌండ్ మళ్లీ చూడాల్సిందే!