మీరూ…ఇంటలిజెంట్స్ గా మారాలా…!? ఈ కథనం చదవండి.

మనుషులందరూ సమానమేనా…?అంటే అవును సమానమే అని చెప్పాలి.అయితే ఇది ఒక సామాజిక కోణంలో మాత్రమే మనుషులు అంతా సమానం అని ఈ సమాజం భావిస్తోంది. నిజంగా ప్రతీ మనిషికి ఓ ప్రత్యేకమైన విధానం కలిగి ఉంటారు.కాబట్టే కొందరు తెలివిగా,మరి కొందరు అతి తెలివిగా,ఇంకా కొంత మందబుద్ధి కలిగి ఉంటారు.ఎవరు ఎలా ఉన్నా అంతా ఒకటే అనుకుంటున్న మనం, మనతో పాటు ఉండే కొంత మందిని చూసి వీరు మంచి ఇంటలిజెంట్ (తెలివిగలవారు)అని కూడా అనుకుంటాం. అవును మనకన్నా తెలివైనవారిని చూసి కొద్దిగా మనం అసూయ పడతాం.అసలు వారు మనకన్నా తెలివైనవారు గా ఉండడానికి కారణం ఏమిటా అనుకుంటాం. అలా అనుకోవడం ప్రక్కన పెడితే పుడుతూనే ఎవ్వరూ ఇంటలిజెంట్స్ కారు.చుట్టూ ఉన్న పరిస్థితులు,మన ఆలోచన,మన దృష్టి, మన పరిశీలన అనే వాటిపై ప్రధానంగా మనసు పెడితే అందరూ ఇంటలిజెంట్ కావచ్చు.

ఇంటలిజెంట్స్ కావాలనుకునే వారికి సూచనలు.

తెలివైన వ్యక్తులు ప్రధానం గా కొన్ని పద్ధతులు కలిగి ఉంటారు.వారు ఎదుటి వారి మాటలను చాలా శ్రద్ధగా వినేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.వీరు ఎక్కువగా మాట్లాడరు. వీరి దృష్టంతా ఎదుటివారి మాటలు వినడంపైనే మనసు కేంద్రీకరిస్తారు. ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు వీరు నిశ్శబ్దంగా ఉండటం, చక్కగా వారి మాటలు వినడం ఓ మంచి లక్షణం.అలాగే ఈ వ్యక్తులు ఏదైనా విషయం మాట్లాడే ముందు,మాట్లాడబోయే ముందు ఆ అంశానికి సంభవించిన సమాచారం సేకరించి మాట్లాడుతారు.
అందులో తొందరేమీ లేనప్పుడు ఆగి,ఆలోచించి మరీ మాట్లాడుతారు. మాటకు తొందరనేది ఉండదు.ఎక్కడ మాట్లాడాలి,ఎక్కడ మౌనంగా ఉండాలనేది బాగా తెలిసినవారు వీరు అందుకే ఇలాంటి వారు తెలివైనవారుగా ఉంటారు.

వీరిలో మరో మంచి లక్షణం ఉంటుంది.ఎదుటి వారి మాటలకు మంచి విలువను ఇస్తారు.అత్యంత తెలివైన వ్యక్తులు,ఇతరులు మాట్లాడే వ్యక్తులకు ఎక్కువ విలువనిస్తారు. పైగా మాట్లాడేందుకు అర్థవంతమైన విషయం ఉన్నప్పుడే వారితో మాట్లాడుతారు.అలాగే అక్కడ ప్రతీ విషయాన్ని ఎప్పటి కప్పుడు గమనిస్తూనే ఉంటారు.ఇలా తెలివైన వ్యక్తులు ఎక్కువగా పరిశీలనా నైపుణ్యం కలిగి ఉండటమే కాకుండా వారి చుట్టు పక్కల ప్రతీ విషయాన్ని గమనిస్తారు.ప్రతీ క్షణం మాట్లాడాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటారు.చిన్న చిన్న విషయాలు అస్సలు పట్టించుకోరు.తెలివైన వ్యక్తులు అర్థవంతమైన సంభాషణలు మాత్రమే వినేందుకు ఇష్టపడుతారు. చిన్న చిన్న సంభాషణలో పాల్గొనేందుకు ఇష్టపడరు.

మరికొన్ని విషయాలు గమనిస్తే ఇతరుల యెక్క అటెన్షన్ ఏ విధంగానూ కోరుకోరు.తెలివైన వ్యక్తు లు ఎక్కువగా ఇతరుల సభాషణల్లో జోక్యం కూడా చేసుకోరు.ఇంటర్నల్ సమాచారం ప్రాసెస్ చేస్తారు.అనగా తెలివైన వ్యక్తులు ఎక్కువగా వారి విషయాలను ఆంతర్గతంగా పరిష్కరించుకుంటారు.అలాగే ఈ వ్యక్తులు ఎక్కువ గా ఒక నిర్ధిష్టమైన వ్యక్తుల తో మాట్లాడాలా వద్దా అనే విషయాన్ని ఆలోచించుకు ని నిర్ణయించుకుని సమస్యలను పరిష్కరించుకోవడం చాలా ప్రత్యేక లక్షణం.ఇక అన్నిటికంటే ముఖ్యమైనది వారిలో కనిపించే ప్రధాన లక్షణం నిశ్శబ్దంగా ఉండటం.వీరిని అస్సలు నమ్మకూడదు అనే ప్రచారం ఒకటి ఉంది. డోంట్ వరీ,వీరితో ఏ విధ మైన ప్ర*మాదం ఉండదు. పైగా ఇటువంటివారిని చూసి నేర్చుకోవాల్సిన గుణగణాలు వారిలో చాలా ఉంటాయి.ఎందుకంటే సమాజంలో వీరే చాలా పెద్ద ఇంటలిజెంట్స్. వీరిని గమనిస్తూ,వీరిని ఫాలో అవుతూ ఎవరైనా ఇంటలిజెంట్స్ గా మారవచ్చు.ఇందులో తప్పేమిలేదు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి