కాంతారా హీరోయిన్ రుక్మిణి వసంత్ క్లారిఫికేషన్ –  ఆ మొబైల్ నెంబర్ నాది కాదు అని సోషల్ మీడియాలో ట్వీట్

కన్నడ ఇండస్ట్రీలో ఫుల్ ఫామ్‌లో ఉన్న నటి రుక్మిణి వసంత్ ఇప్పుడు సోషల్ మీడియాలో చేసిన ఒక ట్వీట్‌తో వార్తల్లో నిలిచింది.
2019లో బీర్బల్ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన రుక్మిణి, 2023లో వచ్చిన సప్తసాగరాలు దాటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యింది. తన అందం, సహజమైన అభినయంతో కేవలం కన్నడ ప్రేక్షకులే కాకుండా తెలుగు అభిమానులను కూడా ఆకట్టుకుంది.

తర్వాత అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలో నిఖిల్ సరసన నటించినా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. అయినప్పటికీ, బఘీరా, బైరతి రంగల్, ఏస్ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చాయి. ఇటీవల శివ కార్తికేయన్‌తో నటించిన మదరాసి సినిమా కూడా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రుక్మిణికి మంచి బూస్ట్ ఇచ్చింది.

ఇక రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ కాంతారా: చాప్టర్ 1లో రుక్మిణి నటనకు ప్రేక్షకుల నుండి అప్రతిహత ప్రశంసలు లభించాయి. అయితే ప్రస్తుతం ఆమె పేరు ఒక విచిత్ర కారణంతో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.

సోషల్ మీడియాలో రుక్మిణి వసంత్ ట్వీట్ వైరల్

తన పేరుతో ఒక వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడని రుక్మిణి వసంత్ ట్విట్టర్ (ఇప్పుడు X) ద్వారా వెల్లడించింది.
“9445893273 నెంబర్‌ను ఉపయోగిస్తూ, నా పేరు చెప్పి ఇతరులను సంప్రదిస్తున్న వ్యక్తి ఉన్నాడు. ఆ నెంబర్ నా దికాదు. దయచేసి అలాంటి కాల్స్ లేదా మెసేజ్‌లను నమ్మవద్దు,” అని ఆమె స్పష్టం చేసింది.

తన పేరును ఉపయోగించి మోసపూరిత చర్యలు చేయడం సైబర్ నేరం కింద వస్తుందని, అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆమె హెచ్చరించింది.
“ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా సందేహిస్తే, నేరుగా నాకు లేదా నా టీంకు సంప్రదించండి,” అని అభిమానులకు రుక్మిణి సూచించింది.

ఎన్టీఆర్ మూవీతో టాప్ లీగ్‌లోకి రుక్మిణి

ఇక రుక్మిణి కెరీర్ విషయంలో మరో భారీ ప్రాజెక్ట్ గురించి టాక్ నడుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు సంబంధించిన కొన్ని షెడ్యూల్స్‌లో ఆమె ఇప్పటికే పాల్గొన్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు తెలిసింది.

మేకర్స్ కూడా ఆమె క్రేజ్‌, యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా, అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం.
అలాగే కోలీవుడ్‌లో మణిరత్నం – విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రాబోయే సినిమాలోనూ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తన ప్రతిభతో, అందంతో, సింపుల్ నేచర్‌తో ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించిన రుక్మిణి వసంత్ ఇప్పుడు దక్షిణ భారత సినిమా రంగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న హీరోయిన్‌గా నిలుస్తోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి