మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా టాలీవుడ్ ఎంట్రీ – సత్య హీరోగా ‘జెట్లీ’ మూవీ

అందాల ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకుని వెండితెరకు విజయవంతంగా అడుగుపెట్టిన బ్యూటీలు ఎన్నో మంది ఉన్నారు. ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్, ప్రియాంక చోప్రా వంటి అందాల కిరీట విజేతలు బాలీవుడ్‌లోనే కాదు, ఇతర భాషల సినిమాల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించారు. ఇప్పుడు వారి జాబితాలోకి మరో యువ అందగత్తె అడుగుపెట్టబోతోంది. ఆమె ఎవరో కాదు… దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 విజేత రియా సింఘా. ఈ 18 ఏళ్ల బ్యూటీ త్వరలోనే తెలుగు సినిమాల్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.

మిస్ యూనివర్స్ ఇండియా 2024 విజేత రియా సింఘా

గుజరాత్‌కు చెందిన రియా సింఘా చిన్న వయసులోనే వరుసగా ప్రతిష్టాత్మక బ్యూటీ టైటిళ్లు దక్కించుకుంది. 2023లో మిస్ టీన్ గుజరాత్, మిస్ టీన్ ఎర్త్ వంటి బిరుదులతో గుర్తింపు తెచ్చుకున్న రియా, 2024లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం అందుకొని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ వేదిక అయిన మెక్సికోలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో టాప్–30 సెమీ ఫైనలిస్టుగా నిలిచి భారతదేశానికి కీర్తి తెచ్చింది. ఇప్పుడు ర్యాంప్‌పై మెరిసిన ఈ యువ క్వీన్ టాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది.

‘జెట్లీ’తో టాలీవుడ్ అరంగేట్రం

టాలీవుడ్‌లో తన ప్రత్యేక కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించిన నటుడు సత్య ఈసారి హీరోగా మారుతున్నాడు. ‘మత్తు వదలరా’లో ఆయన పోషించిన “యేసు దాసు” పాత్ర అతని కెరీర్‌లో మేజర్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ సినిమాలో హీరోకన్నా ఎక్కువ ప్రశంసలు అందుకున్న సత్యకు, దర్శకుడు రితేష్ రానా అప్పుడే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇప్పుడు ‘జెట్లీ’ అనే సినిమాలో హీరోగా ఛాన్స్ ఇచ్చాడు.

రియా సింఘా పుట్టినరోజు సందర్భంగా makers ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. విడుదలైన వెంటనే పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోస్టర్‌ను చూస్తేనే రియాకు యాక్షన్ టచ్ ఉన్న శక్తివంతమైన పాత్ర దక్కిందని అర్థమవుతోంది. సినిమాలో ఆమె పాత్ర పేరు శివానీ రాయ్ అని తెలుస్తోంది.

ఫస్ట్ లుక్ బయటకు వచ్చిన వెంటనే సినిమా మీద భారీ అంచనాలు పెరిగాయి. అయితే మరోవైపు, ఇంత ప్రతిష్ఠాత్మక బిరుదు గెలుచుకున్న బ్యూటీ స్ట్రైట్‌గా ఏదైనా స్టార్ హీరో సరసన ఎంట్రీ ఇస్తే బెటర్ అనిపించేదని, కమెడియన్ పక్కన హీరోయిన్‌గా ఎందుకు అనేది కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ చర్చ మొదలుపెట్టారు. అయినా కూడా రియా సింఘా ఎంట్రీపై టాలీవుడ్‌లో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి