టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన ‘ది రాజా సాబ్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం జనవరి 9న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. రిలీజ్‌కు ముందే ప్రీమియర్ షోలు పడగా, వాటి నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, ఇప్పుడు ఈ సినిమాకు సెకండ్ పార్ట్ ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
‘రాజా సాబ్ 2’కు క్రేజీ అనౌన్స్‌మెంట్
ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలకు సీక్వెల్స్ ప్రకటించడం ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా ప్రభాస్ నటించిన సినిమాలన్నింటికీ పార్ట్ 2 అనౌన్స్ అవుతుండటం విశేషం. ఇప్పటికే సలార్ 2, కల్కి 2 షూటింగ్ దశలో ఉండగా, ఇప్పుడు ఆ జాబితాలోకి ‘రాజా సాబ్ 2’ కూడా చేరింది.
పార్ట్ 2 టైటిల్ ఇదే
‘రాజా సాబ్’ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. ఇదే బ్యానర్‌పై ఈ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. అంతేకాదు, పార్ట్ 2కు “రాజా సాబ్ సర్కార్ : 1935” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ పార్ట్‌లో ప్రభాస్ జోకర్ లుక్‌లో కనిపించనున్నాడు అనే విషయం ఫ్యాన్స్‌ను మరింత ఎగ్జైట్ చేస్తోంది.
ఎండింగ్‌లోనే సీక్వెల్ హింట్
‘రాజా సాబ్’ సినిమా ఎండింగ్‌లోనే పార్ట్ 2కు లీడ్ ఇచ్చేలా ప్రభాస్ లుక్‌ను చూపించారు. ఇది సీక్వెల్ కాదా? ప్రీక్వెల్ కాదా? అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అలాగే ట్రైలర్‌లో కనిపించిన కొన్ని కీలక సన్నివేశాలు సినిమాలో లేకపోవడంతో, అవన్నీ పార్ట్ 2లో చూపించే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
స్టార్ క్యాస్ట్, పాజిటివ్ టాక్
ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించారు. ప్రీమియర్ షోల నుంచే సినిమాకు మంచి స్పందన రావడంతో పాటు, ఇప్పుడు పార్ట్ 2 అనౌన్స్‌మెంట్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



