మాజీ సీ.ఎం,జగన్ తెనాలి పర్యటనలో నిరసన సెగలు.

గుంటూరు జిల్లా తెనాలిలో మంగళవారం రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు.ఇటీవల తెనాలి ఐతానగర్ వద్ద ముగ్గురు యువకులను ఓ రౌడీ షీటర్ అనుచరులుగా చెబుతూ,పోలీసులుస్థానిక నడిరోడ్డుపై లాఠీలతో అరికాలు కోటింగ్ వేసిన విధానాన్ని జగన్ ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని ఆయన ఆరోపణలు చేస్తూ బాధిత యువకులను పరామర్శించేందుకు తెనాలిలో పర్యటించారు.ఈ కారణంగా తెనాలిలో జగన్ పర్యటన పై నిప్పులు చెరిగారు దళిత మరియు ప్రజా సంఘాలు.గతంలో నూతక్కి కిరణ్ అనే యువకుడు హత్యకు సమాధానం ఏది?!అని తెనాలి మార్కెట్ సెంటర్ వద్ద నినాదాలు చేస్తూ,ప్ల కార్డుల ప్రదర్శన,నల్లబెలూ న్స్ ప్రదర్శనతో జగన్ పర్య టనపై నిరసన వ్యక్తంచేస్తూ ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.దీనితో తెనాలి మార్కెట్ సెంటర్ కొద్దిసేపు నిప్పుల గుండం లా మారింది.

మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పర్యటనకు వ్యతిరేకంగా దళిత,ప్రజా సంఘాలు నిర్వహించిన రాస్తారోకో,మానవహారం పెద్దఎత్తున జరిగింది.జగన్ “రౌడీ షీటర్లకు మద్దతు ఇస్తున్నారా…?అనే ప్రశ్నలు లేవనెత్తారు అక్కడ నిరసనకారులు. అలాగే నూతక్కి కిరణ్ అనే యువకుడు హత్యపై మీరు పరామర్శ ఎందుకు చేయలేదు?” అంటూ నిరసనకారులు సంధించిన ప్రశ్నలు గర్జనలా పెద్ద ఎత్తున మారుమోగాయి. నాలుగేళ్లు గడిచినా, నూతక్కి కిరణ్ దేహం లభ్యంకాక, అతడి కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నా, జగన్ రెడ్డికి వారి ఆవేదన కనిపించ లేదా?అనే నినా దాలు వినిపించాయి.ఒక యువకుడి జీవితం అంధకారంలోకి నెట్టబడినప్పుడు,ఆ కుటుంబానికి న్యాయం జరగనప్పుడు,మాజీ ముఖ్యమంత్రిగా మీరు రౌడీ షీటర్లను పరామర్శించడం దారుణం కాదా…?అని విమర్శలు చేశారు.

“మీ పరామర్శలు క్రిమిన ల్స్‌కా? అమాయకులకు కాదా?” అని ప్రశ్నిస్తూ దళిత,ప్రజా సంఘాలు చేసిన నిరసన జగన్ అన్యాయాన్ని ఎత్తి చూపింది అనే విధంగా దళిత సంఘాల నాయకులు అన్నారు.ఈ రాస్తారోకో కేవలం ఒక నిరసన కాదు,అది అణగారిన వర్గాల ఆవేదన,న్యాయం కోసం వారి ఆక్రందన అని పలువురు దళిత,ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు.తెనాలిలో రగులుకున్న ఈ ని-ప్పురవ్వ,రాష్ట్రవ్యాప్తంగా అన్యాయానికి, వ్యతిరేకంగా ప్రజాగ్రహాన్ని రాజేస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదని,ఈ ఘటన జగన్ రెడ్డి కి ఒక స్పష్టమైన హెచ్చరిక పంపింది అంటూ,సంఘవిద్రోహులకు, గంజాయి బ్యాచీల కోసం పోరాడే జగన్ రెడ్డిని రోడ్ల ల్లో నిలదీస్తూ కడిగిపారేస్తున్నారని పలువురు ప్రసంగించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి