Post Office RD: రోజుకు రూ.200తో రూ.10 లక్షలు.. ఈ స్కీమ్ మీకు తెలుసా?

డబ్బు సంపాదించడం కంటే దాన్ని సురక్షితంగా పెంచుకోవడం చాలా ముఖ్యం. షేర్ మార్కెట్ రిస్క్, ప్రైవేట్ స్కీమ్స్ భయం వద్దు అనుకునే వారికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) ఒక నమ్మకమైన మార్గం. రోజుకు కేవలం రూ.200 పొదుపు చేస్తే, కొన్నేళ్లలోనే రూ.10 లక్షలకు పైగా ఫండ్ సొంతం చేసుకోవచ్చు.

పోస్టాఫీస్ RD అంటే ఏమిటి?

పోస్టాఫీస్ RD కేంద్ర ప్రభుత్వ మద్దతుతో నడిచే చిన్న పొదుపు పథకం. అందుకే పెట్టుబడికి 100% భద్రత ఉంటుంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా స్థిర వడ్డీ లభిస్తుంది.

తక్కువ మొత్తంతో పెట్టుబడి

ఈ పథకంలో కేవలం రూ.100తోనే ఖాతా ప్రారంభించవచ్చు. ప్రస్తుతం 6.7% వార్షిక వడ్డీ అందుతోంది. వడ్డీని త్రైమాసికంగా లెక్కించడంతో డబ్బు వేగంగా పెరుగుతుంది. ఖాతా తెరిచిన ఏడాది తర్వాత డిపాజిట్‌పై రుణ సౌకర్యం కూడా ఉంటుంది.

రూ.10 లక్షలు ఎలా వస్తాయి?

  • రోజుకు రూ.200 అంటే నెలకు రూ.6,000
  • 5 ఏళ్లలో పెట్టుబడి: రూ.3,60,000
  • 5 ఏళ్ల తర్వాత లభించే మొత్తం: సుమారు రూ.4.28 లక్షలు
  • మరో 5 ఏళ్లు కొనసాగిస్తే మొత్తం పెట్టుబడి: రూ.7,20,000
  • 10 ఏళ్ల మెచ్యూరిటీ మొత్తం: సుమారు రూ.10.25 లక్షలు

ముందే తీసుకునే అవకాశం

ఈ పథకం కాలపరిమితి 5 ఏళ్లు. అయితే 3 ఏళ్ల తర్వాత అవసరమైతే ఖాతా క్లోజ్ చేయొచ్చు. పిల్లల చదువులు, పెళ్లి ఖర్చులు, రిటైర్మెంట్ ప్లాన్ కోసం రిస్క్ లేకుండా పొదుపు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి