“ఇజ్రాయెల్‌లో మరణానంతరం వీర్యసేకరణ ప్రక్రియ – PMR టెక్నాలజీ”

ఇజ్రాయెల్‌లో 35 ఏళ్ల డాక్టర్ హదాస్ లెవీ, తన భర్త కెప్టెన్ నెతన్యేల్ సిల్‌బర్గ్ మరణించిన 18 నెలల తర్వాత ఓ కుమారుడు జన్మించినట్టు ప్రకటించారు.

ఈ ప్రసవం మరణానంతరం వీర్యసేకరణ (Post-mortem Sperm Retrieval) సాంకేతికతతో సాధ్యమైంది. గాజాలో యుద్ధంలో కెప్టెన్ సిల్‌బర్గ్ 2023 డిసెంబర్ 18న మరణించాడు. ఆయన వంశం కొనసాగాలని భావించిన హదాస్, తన భర్త మరణించిన వెంటనే ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని సంప్రదించి, పోస్ట్‌మార్టమ్ స్పెర్మ్ రిట్రైవల్‌కు అనుమతి కోరింది. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వీర్యాన్ని సేకరించి ఫ్రీజ్ చేశారు.

ఇజ్రాయెల్‌లో ఇలాంటి కేసులు అసాధారణం కాదు. అక్కడ, మరణించిన వ్యక్తి ముందుగా అనుమతి ఇవ్వకపోయినా, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు, భార్య లేదా దీర్ఘకాలిక భాగస్వామి వీర్యసేకరణకు అనుమతి కోరవచ్చు. ఈ విధానంతో అక్కడ ఇప్పటివరకు డజన్ల కొద్దీ పిల్లలు జన్మించారు.


ఈ టెక్నాలజీ గురించి…

  • మరణానంతరం వీర్యసేకరణ (PMR) 2003 నుంచి ఇజ్రాయెల్‌లో చట్టబద్ధం.
  • తల్లిదండ్రులు, భాగస్వామి లేదా పార్టనర్ ఈ ప్రక్రియ కోసం అనుమతి కోరవచ్చు.
  • మరణం తర్వాత 24–36 గంటల లోపే వీర్యసేకరణ జరగాలి.
  • యుద్ధంలో మరణించిన సైనికుల విషయంలో, ఇజ్రాయెల్ ఆర్మీ శరీరాలను వెంటనే ఆస్పత్రికి తరలించి, కుటుంబం అనుమతి కోసం వేచి లేకుండా ముందుగానే వీర్యాన్ని సేకరించి ఫ్రీజ్ చేస్తుంది. తర్వాత కోర్టు అనుమతి తీసుకుంటారు.
  • వీర్యనాళాలు లేదా వృషణాల నుంచి సూది ద్వారా లేదా చిన్న శస్త్రచికిత్స ద్వారా నమూనాలు సేకరిస్తారు. ల్యాబ్‌లో వీర్యకణాలు వేరుచేసి క్రయోప్రిజర్వేషన్ చేస్తారు.
  • అనంతరం IVF + ICSI సాంకేతికతలతో గర్భధారణ సాధ్యం.

విమర్శలు కూడా ఉన్నాయి…

  • మరణించిన వ్యక్తి నిజంగా తండ్రి కావాలనుకున్నాడా?
  • తండ్రి లేని పరిస్థితిలో పిల్లలు పెరగడం సరైనదా?
  • మృతుడి శరీరాన్ని ఈ ప్రక్రియలో ఒక “వనరుగా” మారుస్తున్నారా?

అనే నైతిక ప్రశ్నలు, చర్చలు కొనసాగుతున్నాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి