అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.పోలవరం ప్రాజెక్ట్ కి ఏపీ ప్రభుత్వం ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తోంది.ఈ కథనం యొక్క పూర్తి వివరాలు అందరితో పాటు,మరి ముఖ్యంగా ఈ తరం యువత కూడా అవగాహన కలిగి ఉండటం మంచిది.
భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్‌లో గుండా ప్రవహిస్తున్న గోదావరి నదిపై నిర్మితమవుతున్న భారీ బహుళార్ధసాధక నీటిపారుదల ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్ట్ ఉంది.ఈ ప్రాజెక్టు చరిత్ర గురించి ఇక్కడ మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం.ఈ ప్రాజెక్టును మొదట జూలై 1941లో మద్రాస్ ప్రెసిడెన్సీ నీటిపారుదల శాఖలో అప్పటి చీఫ్ ఇంజనీర్ దివాన్ బహదూర్, ఎల్.వెంకటకృష్ణ అయ్యర్ రూపొందించారు.రెండు పంటల సీజన్ సమయాల లో 3లక్షల50వేల ఎకరాలను సాగు చేయడానికి పోలవరం వద్ద ఒక జలాశయాన్ని అయ్యర్ ఊహించారు. అలాగే,అక్కడ 40 మెగా వాట్ల జలవిద్యుత్ ప్లాంట్‌ను కూడా ప్లాన్ చేశారు. శంఖుస్థాపన విషయానికి వస్తే ఈ ప్రాజెక్టు 1980లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదే శ్ ముఖ్యమంత్రి అయిన టంగుటూరి అంజయ్య పునాది రాయి వేశారు. అయితే,2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి భూమి పూజ చేసి పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని8,261 కోట్లుగా అంచనా వేసే వరకు ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు.అలా ఆనాటి కి,వైఎస్.రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం గా ఈ ప్రాజెక్టును 33% పూర్తి చేసింది.ఇక 2014 మే నెలలో కేంద్ర మంత్రి వర్గం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేసింది మరియు ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ నిర్మాణం కూడా ప్రారంభించింది. 2014 నాటికి ఏ.పీ,లో చంద్రబాబు అధికారంలో ఉన్నారు.
పోలవరం డ్యామ్ నిర్మాణంలో స్వాతంత్రం పూర్వం నుండి ఎందుకు ఇంతలా ఆలస్యం జరుగుతుందనేదానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒడిశా మరియు ఛత్తీస్‌గఢ్‌లతో అంతర్రాష్ట్ర జల వివాదాలు అలాగే పర్యావరణ సమస్యలు మరియు భూసేకరణ వంటి అనేక సవాళ్లను ఈ ప్రాజెక్ట్ ఎదుర్కొవడం కాలక్రమేణా ప్రాజెక్ట్ ఖర్చు కూడా పెరుగుతూ వచ్చింది.1946-47లో 129 కోట్ల నుండి 2017-18 ధరలను బట్టి 47,726 కోట్లకు అంచనాలు పెరిగాయి.అదేవిధంగా 2022 నాటికి పోలవరం ప్రాజెక్టుపై 16,035.88 కోట్ల వ్యయంతో పూర్తి అవు తుందని అప్పటి ప్రభుత్వం వైసీపీ లెక్కలు వేసింది.అయితే కేంద్రం ఆ వ్యయం అమలు కోసం13,226.04 కోట్లు విడుదల చేసింది.ఇక ఈ ప్రాజెక్టు 2027 నాటికి పూర్తవుతుందని,ఎట్టకేలకు పూర్తిచేసి తీరాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి.ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో 15,000 కోట్లు కేటాయించి పోలవరం ప్రాజెక్ట్ పనులు చేయడం వేగవంతం చేసింది.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మైలురాళ్ళు,రికార్డ్స్.
ప్రాజెక్టు చరిత్రలో కొన్ని ముఖ్యమైన మైలురాళ్ళు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లను కలిగి ఉంది.2019జనవరి లో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కేవలం 24 గంటల్లోనే 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీటును పోయడం ద్వారా “గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ “లోకి పోలవరం ప్రాజెక్ట్ చేరింది.అలాగే క్రెస్ట్ గేట్ ఇన్‌స్టాలేషన్ విషయానికి వస్తే,పోలవరం మొదటి క్రెస్ట్ గేట్‌ను 2018 డిసెంబర్ అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.2019-2024 మధ్య కాలంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వైసీపీ ప్రభుత్వం చూసింది.అయితే వైసీపీ పాలనలో అనిల్ కుమార్ యాదవ్,అంబటి రాంబాబు సంబంధిత శాఖా మంత్రులుగాను ఉన్నారు. వైసీపీ హయాంలో జరిగింది ఏమీలేదు.
పోలవరం స్పిల్ వే 48 రేడియల్ గేట్ల ద్వారా 50 లక్షల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేసేలా డిజైన్ చేశారు.ఇది చైనాలోని త్రిగార్జెస్ డ్యాం 41 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసే విధంగా ఉంది.కానీ.. దానికంటే ఎక్కువగా..పోలవరం ప్రాజెక్టును 50 లక్షల క్యూసెక్కులకు డిజైన్‌ను రూపొందించారు.గత వందేళ్ల చరిత్రను ఆధారం గా ఈ స్పిల్ వేను,గేట్లను డిజైన్ చేశారు వందేళ్ళలో గోదావరికి 40లక్షలకుపైగా క్యూసెక్కుల వరద వచ్చిన చరిత్ర ఉందని ఒక అంచనా.అందుకే మొదట్లో 36 లక్షల క్యూసెక్కుల డిశ్చారజ్ కెపాసిటీతో నిర్మించాలనుకున్న స్పిల్ వేను 50లక్షల క్యూసెక్కుల కు పెంచేశారు. ప్రాజెక్టులో ని ఒక్కో రేడియల్ గేటు 16మీటర్ల వెడల్పు,20 మీటర్ల పొడవు,300 మెట్రిక్ టన్నుల బరువుతో రోజుకు 432 టిఎంసిలు వరద నీటిని దిగువకు విడుదల చేసే సామర్ద్యం తో పోలవరం ప్రాజెక్టు రేడియల్ గేట్లను ప్రత్యేకం గా డిజైన్ చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ ప్రత్యేక ప్రయోజనాలు
ఈ ప్రాజెక్టు పూర్తయితే, విశాఖపట్నం,తూర్పు గోదావరి,పశ్చిమ గోదావరి,కృష్ణా జిల్లాలలో సుమారు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.విశాఖ పట్నంలో కంపెనీలు, ఫ్యాక్టరీల నీటి అవసరాలను తీరుస్తుంది.విశాఖపట్నం నగరానికి తాగు నీరు అందిస్తుంది.కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత తగ్గుతున్నందున బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా పోలవరం ఉపయోగపడుతుంది.
పోలవరం ప్రస్తుత పరిస్థితి ఏమిటి…?
పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇది స్క్రీన్ వాల్ ప్రాజెక్ట్ అత్యంత ముఖ్యమైన నిర్మాణం స్క్రీన్ వాల్.చంద్రబాబు హయాంలో విదేశీ కంపెనీ బావర్ తో ఈ పనులు చేయించారు.నదీ గర్భం లోకి 70 మీటర్ల లోతు నుంచి ఈ విభజన గోడను నిర్మించాల్సి ఉంది.జగన్ హయాంలో ఈ నిర్మాణాన్ని వరదల నుంచి కాపాడలేక పోయారు.ఎగువ కాఫర్ డ్యామ్ లోని ఖాళీలను సకాలంలో పూరించనం దున ఈ డయాఫ్రమ్ వాల్ 2020 వరదలో చాలా వరకు ధ్వంసమైంది.జాతీ య జలవిద్యుత్ పరిశోధన కేంద్రం దీని సామర్థ్యంపై పరీక్షలు నిర్వహించింది. పాడైన ప్రదేశంలో సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని,లేనిపక్షంలో కొత్త డయాఫ్రమ్ వాల్ ను నిర్మించాలని సూచించారు. కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే బాగుంటుందని బాయర్ కంపెనీ పేర్కొంది. నిపుణులందరూ దీనిపై నిర్ణయం తీసుకోవాలి. ఇందుకు దాదాపురూ.600 కోట్లు ఖర్చవుతుంది.