పెళ్లి చూపుల్లో కొత్త ట్రెండ్: మేకప్ చెక్‌ నుంచి ఆరోగ్య పరీక్షల వరకూ..!

ఒకప్పుడు పెళ్లి చూపుల్లో అమ్మాయి మాట, నడక, పాట వంటివి చూసి నచ్చితే పెళ్లి కుదిరిపోయేది. కాలక్రమేణా ఈ పద్ధతులు మారిపోయాయి. కేవలం కొన్ని మీటింగ్‌లకే నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు వచ్చాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో, పెళ్లి చూపులలో కొత్తగా వస్తున్న ట్రెండ్‌పై చర్చకు దారి తీసింది.

ఆ వీడియోలో, పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు అమ్మాయిని పూర్తిగా పరిశీలించేందుకు విచిత్ర పద్ధతులు అనుసరించారు. ఆమె ముఖానికి మేకప్ ఉందా లేదా అని తడిమి చూడడం, జుట్టు అసలైనదా కాదా అని గట్టిగా లాగడం చేశారు. ఈ తనిఖీలు చూసిన అమ్మాయి కుటుంబం ఆశ్చర్యపోయి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగ్రహంతో ఉన్న అమ్మాయి తల్లి, తన భర్తతో కలిసి అబ్బాయి షర్ట్, ప్యాంట్ కూడా తీసి చూపించమని డిమాండ్ చేయడంతో వాదన ఘర్షణకు దారి తీసింది.

ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఇలాంటి తనిఖీలు అవసరమని, భవిష్యత్తులో మోసాలు తగ్గుతాయని అభిప్రాయపడుతుండగా, మరికొందరు ఇది వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే చర్య అని విమర్శిస్తున్నారు. కొందరు నిపుణులు మాత్రం రూపం, మేకప్ వంటి వాటికంటే ముఖ్యమైన అంశాలు ఆరోగ్యం, సంతానోత్పత్తి సామర్థ్యం, లైంగిక సమస్యలు ముందుగానే పరీక్షలు చేయించుకోవడం అవసరమని సూచిస్తున్నారు.

టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో, పెళ్లి లాంటి సున్నితమైన విషయాల్లో కూడా పారదర్శకత తప్పనిసరి అని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. పెళ్లి అనేది కేవలం రూపం ఆధారంగా కాకుండా, శారీరక, మానసిక ఆరోగ్యం, వ్యక్తిత్వం, అనుభవం వంటి అంశాలపై కూడా ఆధారపడాలని నిపుణులు సూచిస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి