నెల్లూరు: ‘లేడీ డాన్’ అరవ కామాక్షమ్మ ఇంటి ధ్వంసం – ఆర్డీటీ కాలనీలో ఉద్రిక్తత

నెల్లూరు నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హత్యలు, గంజాయి వ్యాపారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘లేడీ డాన్’గా పేరొందిన అరవ కామాక్షమ్మ నివాసాన్ని స్థానికులు పూర్తిగా ధ్వంసం చేశారు. సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది.

వివరాల ప్రకారం, నెల్లూరు ఆర్డీటీ కాలనీలో నివసిస్తున్న అరవ కామాక్షమ్మ కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గంజాయి వ్యాపారం చేయడమే కాకుండా, నగరంలో పలు హత్యలకు పాటు పడుతోందని వారు విమర్శించారు. ఈ నేపథ్యంలో సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో ఆమెను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

అయితే, ఆమె తిరిగి తమ ప్రాంతానికి రాకూడదని భావించిన స్థానికులు వందలాది మంది కలిసి ఆమె ఇంటిపై దాడి చేసి కూల్చివేశారు. ఇదే సమయంలో ఆమె అనుచరులుగా భావిస్తున్న పలువురు ఇళ్లను కూడా ధ్వంసం చేశారు. తమ ప్రాంతంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారికి చోటు లేదని స్థానికులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో ఆర్డీటీ కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి