హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలో కెరీర్ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు శుభవార్త. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సుల్లో ప్రవేశాల కోసం NCHM JEE 2026 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష జాతీయ స్థాయిలో నిర్వహించనున్నారు.
NCHM JEE 2026 ద్వారా ఎక్కడ ప్రవేశాలు?
దేశవ్యాప్తంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (NCHM&CT)కి అనుబంధమైన ప్రభుత్వ, ప్రైవేట్ హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 12 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి.
దరఖాస్తు తేదీలు, ముఖ్యమైన వివరాలు
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
- దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 25, 2026
- పరీక్ష తేదీ: ఏప్రిల్ 25, 2026
అర్హత ప్రమాణాలు
బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సులో ప్రవేశం పొందాలంటే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత పరీక్షను ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా ఉత్తీర్ణత పొందివుండాలి.
దరఖాస్తు ఫీజు వివరాలు
- జనరల్ అభ్యర్థులు: రూ.1000
- ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు: రూ.700
- ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు / థర్డ్ జెండర్ అభ్యర్థులు: రూ.450
NCHM JEE 2026 పరీక్ష విధానం
ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
- మొత్తం ప్రశ్నలు: 120
- మొత్తం మార్కులు: 480
- ప్రతి ప్రశ్నకు మార్కులు: 4
- నెగెటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత
- పరీక్ష భాష: ఇంగ్లిష్, హిందీ
సబ్జెక్ట్ వారీగా ప్రశ్నల పంపిణీ
- న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్ – 15 ప్రశ్నలు
- రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ – 15 ప్రశ్నలు
- జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ – 15 ప్రశ్నలు
- ఇంగ్లిష్ లాంగ్వేజ్ – 45 ప్రశ్నలు
- ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ – 30 మార్కులు
కెరీర్ అవకాశాలు
ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు హోటల్ ఇండస్ట్రీ, టూరిజం, ఎయిర్‌లైన్స్, క్యాటరింగ్, హాస్పిటాలిటీ సర్వీసెస్ రంగాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయి.



