పంజాబ్‌లో దారుణం – జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడిని స్నేహితులే కాల్చిచంపారు

పంజాబ్‌లో ఒక భయానక ఘటన చోటుచేసుకుంది. జాతీయ స్థాయిలో కబడ్డీ ఆడుతూ పేరు తెచ్చుకున్న యువ క్రీడాకారుడు తేజ్‌పాల్ సింగ్ (26)ను స్నేహితులే అతి కిరాతకంగా కాల్చి చంపారు. లూథియానా జిల్లాలోని జాగ్రావ్ పట్టణంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.

పోలీసుల ప్రకారం, తేజ్‌పాల్ సింగ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి స్థానిక ఫ్యాక్టరీ వైపు నడుస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో పాత గొడవలపై వారిలో వాగ్వాదం మొదలై క్షణాల్లోనే తీవ్ర ఘర్షణకు దారితీసింది. అదే సమయంలో వారితో ఉన్న మరో వ్యక్తి ఆకస్మికంగా తుపాకీ తీసి తేజ్‌పాల్ ఛాతీపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన జాగ్రావ్‌లోని ఎస్ఎస్పీ కార్యాలయానికి కేవలం కొద్దిదూరంలోనే జరగడం పోలీసులను కూడా ఆశ్చర్యపరిచింది.

రక్తపు మడుగులో కుప్పకూలిన తేజ్‌పాల్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, వైద్యులు అతన్ని అప్పటికే మృతిగా ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల గుర్తింపు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని లూథియానా ఎస్ఎస్పీ తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి