నారా లోకేష్ బాధ్యతాయుత వైఖరి – రెండు ఘటనల్లో చూపిన నాయకత్వం భవిష్యత్ ముఖ్యమంత్రి లక్షణం!

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నారా లోకేష్ రాజకీయంగా, పరిపాలనా పరంగా చురుకైన పాత్రను పోషిస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం మరింత దృఢమైన, నిర్ణయాత్మక నాయకుడిగా మారారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎలాంటి అంశం వచ్చినా వెంటనే స్పందిస్తూ ప్రజా సమస్యలపై సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా రెండు ముఖ్యమైన సంఘటనల్లో ఆయన ప్రదర్శించిన బాధ్యతాయుత వైఖరి ఆయనలో భవిష్యత్ ముఖ్యమంత్రి లక్షణాలు ఉన్నాయని మరోసారి నిరూపించింది.

మొదటి సంఘటన — కాశీబుగ్గ విషాదం పై స్పందన
ఇటీవల శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటనలో తొమ్మిది మందికి పైగా భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత, గుడి నిర్మాణంలో పాలుపంచుకున్న పాండాను అరెస్టు చేయాలన్నా, గుడిని ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలన్నా పలు వర్గాలు నారా లోకేష్‌పై ఒత్తిడి తెచ్చాయి. అయితే లోకేష్ ఆ ఒత్తిడిని పూర్తిగా నిరాకరించి, “ఆ భక్తులు తమ సొంత డబ్బులతో, భక్తి భావంతో ఆలయాన్ని నిర్మించారు. వారిపై చర్యలు తీసుకోవడం సరికాదు” అని స్పష్టం చేశారు. అంతేకాదు, గుడిని మూసివేయాలన్న సూచనను కూడా తిరస్కరించి, “వారిని ఎవరూ వేధించకూడదు” అని పోలీసు అధికారులకు సూచించారు. ఈ నిర్ణయంతో ఆయన సమతుల్యమైన, బాధ్యతగల నాయకుడిగా నిలిచారు.

రెండవ సంఘటన — క్రైస్తవ యాత్రికుల రక్షణలో స్పందన
కృష్ణా జిల్లాకు చెందిన కొంతమంది క్రైస్తవులు వేలంగిని మాత ఆలయ దర్శనార్థం తమిళనాడుకు వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో స్థానిక ఆటో డ్రైవర్లతో ఘర్షణ జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బస్సులో ఉన్నవారిని అడ్డగించి బెదిరింపులకు దిగారని సమాచారం. ఆ బస్సులో ఉన్న ఒక పాస్టర్ నారా లోకేష్ బృందంతో పరిచయం ఉండటంతో వెంటనే లోకేష్‌ను సంప్రదించారు. ఆ సమాచారం అందుకున్న వెంటనే నారా లోకేష్, తమిళనాడు యువజన సంక్షేమ మంత్రి ఉదయనిది స్టాలిన్‌తో నేరుగా మాట్లాడి వెంటనే పోలీసు రక్షణ ఏర్పాటు చేయించారు. పోలీసులు ఆ బస్సును 30 కిలోమీటర్ల దూరం వరకు ఎస్కార్ట్ చేస్తూ సురక్షితంగా ఆంధ్ర సరిహద్దు వరకు తీసుకువచ్చారు. దీంతో ప్రాంతీయ భాషా వివాదాలు పెద్దదిగా మారకుండా నివారించగలిగారు.

ఈ రెండు సంఘటనల్లోనూ నారా లోకేష్ చూపిన తక్షణ నిర్ణయం, మానవీయత, సమతుల్యత ఆయన నాయకత్వ ప్రతిభను ప్రతిబింబిస్తున్నాయి. పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ బాధ్యతలు రెండింటినీ సమానంగా నిర్వహిస్తూ ప్రజల మనసుల్లో “భవిష్యత్ ముఖ్యమంత్రి”గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు నారా లోకేష్.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి