ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. పుట్టుకతోనే లివర్ వ్యాధితో బాధపడుతున్న చిత్తూరు జిల్లా, పలమనేరుకు చెందిన 6 నెలల గజ్జల దీపూ నాయుడు అనే చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు లోకేష్ కీలక పాత్ర పోషించారు.
ఆ చిన్నారి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వైద్యులు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ తప్పనిసరి అని సూచించారు. మొత్తం ఖర్చు రూ.20 లక్షలు అవుతుందని చెప్పారు. చిన్నారి తండ్రి జగదీష్ ఒక పౌల్ట్రీ ఫామ్‌లో చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెద్ద మొత్తం ఖర్చు చేయలేని పరిస్థితిలో కుటుంబం గందరగోళానికి లోనైంది.
ఇటు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి వినతిపూర్వకంగా వెళ్లిన ఆ కుటుంబానికి ఆయన సహకారంతో మొదటగా ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు విడుదల అయ్యాయి. అయినా ఇంకా డబ్బు అవసరం కావడంతో, కుటుంబం మంత్రి నారా లోకేష్‌ను వ్యక్తిగతంగా కలిసింది. లోకేష్ తక్షణమే స్పందించి, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మరో రూ.15 లక్షలు మంజూరు చేసి, అవసరమైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) జారీ చేయించారు.
చికిత్సకు ఆలస్యం కాకుండా అన్ని ఏర్పాట్లు జరిగాయి. చిన్నారి ప్రాణాలు సురక్షితంగా నిలిచాయి. దీనికి కృతజ్ఞతగా చిన్నారి కుటుంబం మంత్రి నారా లోకేష్‌కు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది.
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రాష్ట్రంలో భారీ స్థాయిలో సహాయం
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఏడాదిలో CMRF ద్వారా సుమారు ₹394 కోట్లకు పైగా సహాయం అందింది. 35,000కి పైగా కుటుంబాలకు వైద్య, ఆపద సహాయంగా ఈ నిధి ఉపయోగపడింది. అనారోగ్య పరిస్థితి తీవ్రతను బట్టి తక్షణమే Letter of Credit జారీ చేసి చికిత్సలు అందిస్తున్నారు.
ఈ ఘటనలోనూ నారా లోకేష్ స్పందించిన తీరుతో ప్రభుత్వం how ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తుందనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తుంది.