వైసీపీ కీలకనేతకి బెయిల్ మంజూరు, కానీ మళ్ళీ పోలీసుల అదుపులోకి….!!

nandigam-suresh-granted-bail-pt-warrant-issued-again

మంగళగిరి: వైసీపీ మాజీ పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్‌ కి గుంటూరు జిల్లా కోర్టు నుండి బెయిల్ మంజూరు అయ్యింది.మే నెలలో 18వ తేదీన ఓ దాడి ఘటనకు సంభవించి తుళ్లూరు పోలీసులు సురేష్ ని అరెస్ట్ చేశారు. నాటి నుండి గుంటూరు జిల్లా జైలులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారన్న విషయం తెలిసిందే.ఈ కేసు తుళ్ళూరుకి చెందిన టీడీపీ కార్యకర్త అయిన ఇసుక పల్లి రాజుపై జరిగిన దాడికి చెందినది.అయితే ఈ దాడి ఘటన 17మే 2025న ఉద్దండరాయుని పాలెంలోని నందిగం సురేష్ ఇంటి వద్దనే జరిగింది.ఈ దాడి అనంతరం రాజు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం ఆయన కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అటు బెయిల్ మంజూరు,వెంటనే ఇటు పి.టి, వారెంట్…!!

వైసీపీ మాజీ ఎంపీకి అలా బెయిల్ మంజూరు కాగానే నందిగం సురేష్ కి పోలీసులు మరో షాక్ ఇచ్చారు. బెయిల్ మంజూరు అయిన కొద్ది గంటలోనే మరో పీటీ వారెంట్ తో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది.ఉద్దండరాయునిపాలెంకి చెందిన రాజుపై దాడి కేసులో రిమాండ్ లో ఉన్న సురేష్ గుంటూరు సబ్ జైలు నుంచి విడుదలయ్యే లోపు ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అయితే నందిగం సురేష్ ను మంగళగిరి కోర్టులో పోలీసులు హాజరు పరచనున్నారని తెలుస్తుంది. గతంలో కోర్టు వాయిదాలకు సరిగా హాజరు కాకపోవడంపై అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం…

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి